KGF Star Yash: కన్నడ సినీ కార్మికులకు అండగా రాఖీ భాయ్
KGF Star Yash: 3000 మంది కన్నడ సినీ కార్మికులందరు ప్రతి ఒక్కరికీ రు.5 వేల చొప్పున సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.
KGF star Yash:(The Hans India)
KGF Star Yash: కేజీఎఫ్ స్టార్ యష్... తన స్టార్ డమ్, క్రేజ్ రేంజ్ లోనే కరోనా సాయం చేశారు. కన్నడ సినీ కార్మికులందరు ప్రతి ఒక్కరికీ రు.5 వేల చొప్పున సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. దీని మొత్తం కోటిన్నర అవుతుంది. తన సాయం ఇంతటితో ఆగదని కూడా యష్ తెలియచేశాడు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి పనుల్లేక ఇబ్బంది పడుతున్న కన్నడ సినిమా కార్మికులకు నేనున్నానంటూ అభమిచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.5000 లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
కన్నడ సినీ ఇండస్ట్రీలో 21 విభాగాల్లో పనిచేస్తోన్న దాదాపు 3 వేల మందికి ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు ట్విటర్ వేదిక తెలిపారు. నేను చేస్తున్న ఈ సాయం నష్టాన్ని పూర్తిగా పూడ్చలేదని నాకు తెలుసు. కానీ త్వరలోనే చిత్ర సీమ తిరిగి కోలుకుంటుందన్న ఆశతో నావంతు ప్రయత్నంగా ఈ కార్యక్రమం చేస్తున్నా అని యశ్ పేర్కొన్నారు.