OTT: ఓటీటీలోకి కీర్తి సురేశ్‌ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Keerthy Suresh: వివాహానికి ముందు నటించిన చివరి సినిమా బేబీ జాన్‌. ఈ సినిమా ద్వారానే కీర్తి సురేశ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.

Update: 2025-02-19 10:12 GMT

Keerthy Suresh: వివాహానికి ముందు నటించిన చివరి సినిమా బేబీ జాన్‌. ఈ సినిమా ద్వారానే కీర్తి సురేశ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తెరి సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని కాలీస్‌ హిందీలో తెరకెక్కించారు. కాగా తెరి చిత్రంలో లీడ్‌ రోల్‌లో సమంత నటించింది. అయితే ఈ సినిమా రీమేక్‌లో కీర్తి సురేశ్‌ను తీసుకోవాలని సమంతనే సజెస్ట్‌ చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని కీర్తి సురేష్‌ కూడా ప్రకటించింది.

ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్‌లో సందడి చేసిన ఈ మూవీ ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాను చూడాలంటే యూజర్లు రూ. 349 రెంటల్‌ విధానంలో చెల్లించాల్సి ఉండేది. కానీ తాజాగా ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పించారు. అమెజాన్‌ ప్రైమ్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. బుధవారం నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే అవకాశం కల్పించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా హిందీ, తమిళ్‌, తెలుగుతో పాటు 9 భాషల్లో సబ్‌ టైటిల్స్‌తో ఈ సినిమాను చూడొచ్చు. ఇక బేజీ జాన్‌ సినిమా కథ విషయానికొస్తే.. తన కుమార్తె ఖుషీతో కలిసి కేరళలో ఓ మారుమూల గ్రామంలో జీవిస్తుంటాడు జాన్‌ (వరుణ్‌ ధావన్‌). బేకరీ నడపుతూ సంతోషంగా బతుకుతుంటారు. ఖుషీ టీచర్‌ తారతో జాన్‌కు అనుకోనివిధంగా స్నేహం ఏర్పడుతుంది. చివరకు ఆమె జాన్‌పై ప్రేమ పెంచుకుంటుంది. తార రూపంలో ఈ తండ్రీ కుమార్తెలకు ఓ ప్రమాదం ఎదురవుతుంది. ఆమె వల్ల కలిగిన ఇబ్బందులను బేబీ జాన్‌ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు అందరికీ దూరంగా మారుమూలన ఎందుకు ఉంటున్నాడు? అతడి గతం ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Tags:    

Similar News