OTT: నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ కొత్త సినిమా.. 5 భాషల్లో స్ట్రీమింగ్
OTT: ‘మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్.. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఆమె నటించిన నూతన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ జూలై 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
OTT: నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ కొత్త సినిమా.. 5 భాషల్లో స్ట్రీమింగ్
OTT: ‘మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్.. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఆమె నటించిన నూతన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ జూలై 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు.
కథేంటంటే.?
ఈ చిత్రం కథ 1990ల నాటి దక్షిణ భారత గ్రామమైన చిట్టి జయపురం అనే ఊరిని నేపథ్యంగా సాగుతుంది. ఈ గ్రామానికి చెందిన సాధారణ ప్రజలు అసాధారణ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారన్నదే ఈ సినిమా ఇతివృత్తం. దర్శకుడు ఐ.వి. శశి ఈ కథను కామెడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కించారు.
ఈ చిత్రంలో ప్రధానంగా సామాజిక అంశాలను కామెడే, ఎమోషన్‌తో చూపించారు. గ్రామీణ జీవితం, అక్కడి సమస్యలు, మనుషుల మధ్య సంబంధాలు అన్నీ ఇందులో వినోదాత్మకంగా ప్రస్తావించారు. ప్రేక్షకులను ఆలోచింపజేస్తూనే నవ్వించే విధంగా దర్శకుడు కథను తీర్చిదిద్దారు.
ఈ చిత్రంలో సుహాస్, బాబు మోహన్, శత్రు, తళ్లూరి రామేశ్వరి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో కీర్తి నటన మళ్ళీ దేశవ్యాప్తంగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించారు. రచన వసంత్ మారింగంటి చేస్తే, దర్శకత్వం ఐ.వి. శశి వహించారు. తెలుగు భాషతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేసి ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు.