keerthy Suresh: గుడ్‌న్యూస్ చెప్పిన కీర్తి సురేష్
keerthy Suresh: ఈ మధ్యనే జనవరి 11వ తేదీన మహానటి బ్యూటీ కీర్తి సురేష్ కరోనా వైరస్ బారిన పడినట్టు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియ చేసిన సంగతి తెలిసిందే.
keerthy Suresh: గుడ్‌న్యూస్ చెప్పిన కీర్తి సురేష్
keerthy Suresh: ఈ మధ్యనే జనవరి 11వ తేదీన మహానటి బ్యూటీ కీర్తి సురేష్ కరోనా వైరస్ బారిన పడినట్టు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అభిమానులు చాలా కలత చెందుతున్నారు. తాజాగా తాను రికవర్ అవుతున్నట్లు కీర్తి సురేష్ చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పాజిటివ్ వచ్చిన ఎనిమిది రోజుల తర్వాత నిన్న కీర్తిసురేష్ సోషల్ మీడియా ద్వారా తనకు కరుణ వైరస్ నెగిటివ్ వచ్చింది అంటూ అభిమానులతో పంచుకుంది. తనకోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపింది.
"ఈ మధ్యకాలంలో నెగిటివ్ రావడమే ఒక పెద్ద పాజిటివ్ థింగ్. మీ అందరి ప్రార్థనలకు ప్రేమకు నా కృతజ్ఞతలు. పొంగల్ మరియు సంక్రాంతి మీరు చాలా బాగా జరుపుకున్నారు అని అనుకుంటున్నాను" అంటూ మేకప్ లేని ఫోటో పెట్టింది కీర్తి సురేష్. కరోనా కారణంగా కొంచెం నీరసంగా కీర్తి సురేష్ అదే అందంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక సినిమాల పరంగా చూస్తే కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన "సర్కారు వారి పాట" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.