బంపర్ ఆఫర్ కొట్టేసిన 'మహానటి'

Update: 2019-04-09 08:23 GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ కొనసాగుతోంది.

ఇప్పటికే అనుష్క, నయనతార వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. శృతిహాసన్ పేరు కూడా వినిపించింది. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో కీర్తి సురేష్ పేరు కూడా బయటకు వచ్చింది. 'మహానటి' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో పెద్ద హిట్ సినిమాల్లో నటించలేదు. అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం కీర్తి సురేష్ కు దక్కింది. దీనిపై కూడా ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

Similar News