Sri Simha: "దొంగలున్నారు...జాగ్రత్త" అంటున్న కీరవాణి కుమారుడు
Sri Simha New Movie: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహ రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన యమదొంగ చిత్రంలో బాలనటుడిగా
Sri Simha New Movie Dongalunnaru Jagratha (ఫోటో: ట్విట్టర్)
Dongalunnaru Jagratha Movie: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహ రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన "యమదొంగ" సినిమాలో బాలనటుడిగా వెండితెరకి పరిచయమై "మత్తు వదలరా", "తెల్లవారితే గురువారం" చిత్రాలతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రాలతో నటుడిగా తన మార్క్ చూపించిన శ్రీ సింహ తాజాగా "దొంగలున్నారు.. జాగ్రత్త" అంటూ వెండితెరపై కనిపించబోతున్నాడు. ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్ మరియు గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు సతీష్ త్రిపుర దర్శకత్వం వహించనున్నాడు. ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రం హైదరాబాద్ లో నేడు పూజ కార్యక్రమం ముగించుకొని షూటింగ్ ని ప్రారంభించారు.
ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో తమిళ నటుడు సముద్రఖని నటించబోతున్నాడని, "మత్తువదలరా" చిత్రంలో ఉన్నటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు శ్రీ సింహ "దొంగలున్నారు.. జాగ్రత్త" సినిమా రాబోతుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో నిర్మాత సురేష్ బాబుతో పాటు నటుడు సముద్రకని కూడా పాల్గొనారు. ఆర్ఆర్ఆర్ చిత్ర సంగీత పనుల్లో బిజీబిజీగా గడుపుతున్న కీరవాణి, తన కుమారుడి సినిమాల కథ ఎంపిక విషయంలో కొన్ని సూచనలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల విడుదలైన తెల్లవారితే గురువారం చిత్రం ఓటీటీలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది.