Karthikeya 2: "కార్తికేయ 2" కలెక్షన్ల విషయంలో సీన్ రివర్స్..

Karthikeya 2: 2014లో విడుదలైన సూపర్ హిట్ సినిమా "కార్తికేయ" కి సీక్వెల్ గా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా "కార్తికేయ 2".

Update: 2022-08-19 15:00 GMT

Karthikeya 2: "కార్తికేయ 2" కలెక్షన్ల విషయంలో సీన్ రివర్స్..

Karthikeya 2: 2014లో విడుదలైన సూపర్ హిట్ సినిమా "కార్తికేయ" కి సీక్వెల్ గా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా "కార్తికేయ 2". చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

తెలుగులో మాత్రమే కాక హిందీలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. సినిమా విడుదలైన మొదటి రోజు "కార్తికేయ 2" కేవలం 7 లక్షలు మాత్రమే కలెక్షన్లు నమోదు చేసుకుంది. హిందీలో పెద్దగా ప్రమోషన్లు కూడా చేయకపోవడంతో కలెక్షన్లు తక్కువనే చెప్పాలి. కానీ విడుదలైన మొదటి రోజు నుంచి సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో రెండవ రోజు నుంచి సినిమా కలెక్షన్లు ఆకాశాన్ని తాగుతున్నాయి. రెండవ రోజు హిందీలో ఈ సినిమా 28 లక్షలు సంపాదించి ట్రేడ్ వర్గాలను సైతం షాక్ కి గురి చేసింది. ఇక మూడవరోజు ఏకంగా 1.10 కోట్లు నమోదు చేసిన "కార్తికేయ 2" నాలుగవ రోజున 1.28 కోట్లు గడించింది.

నిజానికి ఏ సినిమా అయినా విడుదలైన మొదటి రోజు నుంచి కలెక్షన్లు తగ్గుతూ వస్తాయి. కానీ "కార్తికేయ 2" విషయంలో అది రివర్స్ అయింది. ప్రతిరోజు కలెక్షన్లు పెరుగుతూ వస్తున్నాయి. ఐదవ రోజున 1.38 కోట్లు నమోదు చేసుకున్న "కార్తికేయ 2" ఆరవ రోజున 1.68 కోట్లు నమోదు చేసుకుంది. ఇప్పుడు విడుదలైన ఆరు రోజులకే సినిమా 5.75 కోట్లను నెట్ కలెక్షన్లు సంపాదించింది.

Tags:    

Similar News