Ajith Kumar:క్రేజీ డైరెక్టర్‌తో అజిత్ నెక్ట్స్ మూవీ..
తమిళ నటుడు అజిత్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు కార్ రేసింగ్‌లతో తన సత్తా చాటుతున్నాడు. అయితే తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ AK 64కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్రేజీ డైరెక్టర్‌తో అజిత్ నెక్ట్స్ మూవీ..
Ajith Kumar: తమిళ నటుడు అజిత్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు కార్ రేసింగ్‌లతో తన సత్తా చాటుతున్నాడు. అయితే తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ AK 64కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అజిత్ కుమార్ తన 64 సినిమాను కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ AK64 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్నట్టు సమాచారం. అజిత్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను నితిలన్ స్వామినాథన్‌తో చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అలాగే ప్రశాంత్ నీల్, విష్ణువర్ధన్, వెంకట్ ప్రభు వంటి డైరెక్టర్లతో అజిత్ సినిమా చేయబోతున్నట్టు టాక్ నడిచింది. తాజాగా కార్తీక్ సుబ్బరాజ్‌తో సినిమా చేయనున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కార్ రేసులపై దృష్టి పెట్టిన అజిత్.. ఈ సినిమా పనులు త్వరగా పూర్తి చేయనున్నారు. గత నెలలో దుబాయ్‌లో జరిగిన కార్ రేసుల్లో పాల్గొన్న ఆయన జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఐరోపా కార్ రేసుల్లో పాల్గొనడానికి అజిత్ సిద్ధమవుతున్నట్టు సమాచారం.
అయితే ఈలోపే తదుపరి సినిమా ఏకే 64 కథలను వింటున్నారు అజిత్. నితిలన్, విఘ్నేష్ రాజా, కార్తీక్ సుబ్బరాజు కథలు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే అందులో కార్తీక్ సుబ్బరాజు చెప్పిన కథ అజిత్‌కి బాగా నచ్చిందని టాక్. అందుకే ఏకే 64కి ఆయనే దర్శకుడిగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రెట్రో సినిమా రూపొందుతోంది. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. అదే రోజు అజిత్ పుట్టిన రోజు కావడంతో ఏకే 64 అప్‌డేట్ కూడా వచ్చే అవకాశం ఉందని టాక్.