Kantara Chapter 1 OTT Release: కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్... స్ట్రీమింగ్ ఎప్పుడు? ఏ ప్లాట్‌ఫారంలో అంటే?
Kantara Chapter 1 OTT Release: ‘కాంతార చాప్టర్ 1’ నాన్-థియేట్రికల్ హక్కులు భారీ ధర పలికాయి. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.125 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది.
Kantara Chapter 1 OTT Release: కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్... స్ట్రీమింగ్ ఎప్పుడు? ఏ ప్లాట్‌ఫారంలో అంటే?
Kantara Chapter 1 OTT Release: సంచలనం సృష్టించిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలై అభిమానుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఏ సంస్థకు దక్కాయి, ఓటీటీలో ఎప్పుడు విడుదల కాబోతుంది అనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
రికార్డు ధరకు అమ్ముడైన ఓటీటీ రైట్స్
‘కాంతార చాప్టర్ 1’ నాన్-థియేట్రికల్ హక్కులు భారీ ధర పలికాయి. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.125 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. అలాగే శాటిలైట్ హక్కులు రూ.80 కోట్లకు, ఆడియో హక్కులు రూ.30 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో సినిమా విడుదలకి ముందే దాదాపు రూ.235 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఓటీటీలో ‘కాంతార చాప్టర్ 1’ స్ట్రీమింగ్ ఎప్పుడు?
సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత 4 నుంచి 6 వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ లెక్కన, ‘కాంతార చాప్టర్ 1’ నవంబర్ మొదటి వారంలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో: నవంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ కావచ్చు.
హిందీ భాషలో: హిందీలో నిబంధనల ప్రకారం 8 వారాల తర్వాతే విడుదల కానుంది, కాబట్టి నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో అందుబాటులోకి రావచ్చు.
అయితే, ఓటీటీ విడుదల తేదీపై అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై సుమారు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.