Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 సంచలనం!

Kantara Chapter 1: రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. హిందీలో రూ.175 కోట్లు దాటిన ఈ చిత్రం ఆస్ట్రేలియాలో టాప్ ఇండియన్ మూవీగా నిలిచింది.

Update: 2025-10-22 06:30 GMT

రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ‘కాంతార చాప్టర్ 1’ పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. రిలీజ్ అయి మూడు వారాలు గడుస్తున్నా ఈ చిత్రం వసూళ్లలో దూకుడు కొనసాగిస్తోంది.

హిందీలో రూ.175 కోట్ల మార్క్‌ను దాటి బాలీవుడ్‌లో కన్నడ చిత్రం ఈ స్థాయి రెస్పాన్స్ సాధించడం విశేషం. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది టాప్ ఇండియన్ సినిమాగా నిలిచినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

ఇక తెలుగులో 100 కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసింది. కేరళలో రూ.55 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇంకా ఈ చిత్రం వరల్డ్‌వైడ్ కలెక్షన్స్‌తో రికార్డులను బద్దలు కొడుతోంది. రిషబ్ శెట్టి దర్శకత్వంతో పాటు నటనలోనూ తన సత్తా చాటాడు.


కన్నడ సినిమా ఇంతటి గ్లోబల్ రీచ్ సాధించడం ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ‘కాంతార’ సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News