Kannappa Movie: కన్నప్ప సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే ?
Kannappa Movie: జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కన్నప్ప చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. సినిమాలో మంచు విష్ణు నటన హైలైట్‌గా నిలిచింది.

Kannappa Movie: కన్నప్ప సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే ?
Kannappa Movie: జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కన్నప్ప చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. సినిమాలో మంచు విష్ణు నటన హైలైట్‌గా నిలిచింది. ప్రభాస్ అతిథి పాత్రను కూడా ప్రేక్షకులు మెచ్చుకున్నారు. అయితే, చాలా మంది సినీ ప్రముఖులు కన్నప్ప చిత్రాన్ని విమర్శించారు. ఈ సినిమాను రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇప్పుడు సినిమా ఓటీటీ రిలీజ్ గురించి కొత్త సమాచారం బయటపడింది.
శివభక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు విష్ణు కన్నప్ప పాత్రలో నటించాడు. అంతేకాకుండా, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో రుద్ర అనే కీలక పాత్రలో ప్రేక్షకులను అలరించారు. వారితో పాటు మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, యోగి బాబు వంటి పలువురు నటీనటులు ఈ భక్తిరస చిత్రంలో నటించారు. మహాభారత టీవీ సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంయుక్తంగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించారు.
థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన కన్నప్ప చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని తెలిసింది. థియేటర్లలో ప్రదర్శనలు కూడా దాదాపు ముగింపు దశకు వస్తుండటంతో, కన్నప్ప చిత్రం త్వరలోనే ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది.
జులై 25 నుండి కన్నప్ప చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలో డ్రామా ఎక్కువగా ఉండటం చాలా మందికి నచ్చలేదు. ఈ కారణంగానే చాలా మంది సినిమాను విమర్శించారు. ఇప్పుడు ఓటీటీలోనైనా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో వేచి చూడాలి.