Kannappa Movie: విడుదలకు ముందే 'కన్నప్ప'కు కష్టాలు.. హార్డ్‌డ్రైవ్‌ మాయం

Kannappa Movie: త్వరలో విడుదల కానున్న ‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించిన కీలకమైన హార్డ్‌డ్రైవ్‌ను అనుమతి లేకుండా తీసుకెళ్లిన ఘటనపై ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

Update: 2025-05-27 06:05 GMT

Kannappa Movie: విడుదలకు ముందే 'కన్నప్ప'కు కష్టాలు.. హార్డ్‌డ్రైవ్‌ మాయం

Kannappa Movie: త్వరలో విడుదల కానున్న ‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించిన కీలకమైన హార్డ్‌డ్రైవ్‌ను అనుమతి లేకుండా తీసుకెళ్లిన ఘటనపై ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిల్మ్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్‌కుమార్‌ అనే వ్యక్తి ట్వెంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు.. ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన 1.30 గంటల కంటెంట్‌ ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను ముంబయిలోని హెచ్‌ఐవీఈ స్టూడియోస్‌ వారు డీటీడీసీ కొరియర్‌ ద్వారా ఫిల్మ్‌నగర్‌లోని విజయ్‌కుమార్‌ కార్యాలయానికి పంపించారు.

ఈ పార్శిల్‌ను ఈ నెల 25న ఆఫీస్‌బాయ్‌ రఘు స్వీకరించాడు. కానీ, ఎవరికి తెలియకుండా అదే రోజున చరిత అనే మహిళకు హార్డ్‌డ్రైవ్‌ను అప్పగించాడు. అప్పటి నుంచి వీరిద్దరూ పరారీలో ఉన్నారని, ఎవరి ప్రేరణతోనో తమ సినిమా ప్రాజెక్ట్‌కు నష్టం కలిగించాలనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడ్డారని విజయ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఫిల్మ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. హార్డ్‌డిస్క్‌లో ముఖ్యమైన సినిమా కంటెంట్ ఉండటంతో సినిమా యూనిట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Tags:    

Similar News