ప్రముఖ దర్శకుడు విజయ్ రెడ్డి ఇకలేరు

ప్రముఖ దర్శకుడు విజయ్ రెడ్డి శుక్రవారం (అక్టోబర్ 9) రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయన కుమారుడు త్రిపాన్ రెడ్డి తండ్రి..

Update: 2020-10-10 09:05 GMT

ప్రముఖ దర్శకుడు విజయ్ రెడ్డి శుక్రవారం (అక్టోబర్ 9) రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయన కుమారుడు త్రిపాన్ రెడ్డి తండ్రి మరణాన్ని ధృవీకరించారు. మొత్తం 40 కి పైగా కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయ్‌ రెడ్డి మరణవార్త కన్నడ పరిశ్రమకు కలచివేసిందంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో జన్మించిన ఆయన 1953లో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు.

మొదట్లో దర్శకుడు బి విఠలచార్య చిత్రం మానే తంబిండా హెన్నూకు అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పని చేశారు.. ఆ తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు చిత్రాలకు పనిచేశారు. అనంతరం దర్శకుడిగా మారి పలు కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తీసిన కొన్ని ముఖ్యమైన చిత్రాలలో 'గాంధడ గుడి', 'నా నిన్న బిదాలారే', 'రంగమహాల్‌ రహస్య', 'శ్రీనివాస కళ్యాణ', 'సనాడి అప్పన్న', 'కర్ణాటక సుపుత్ర' సినిమాలు మంచి ఆదరణ పొందాయి. విజయ్ రెడ్డి చివరి దర్శకత్వం విష్ణువర్ధన్ నటించిన కర్ణాటక సుపుత్ర. ఈ చిత్రం 1996 లో విడుదలై మంచి విజ్జయం సాధించింది.

Tags:    

Similar News