మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత

సినీపరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. పదిరోజుల కిందట టాలీవుడ్ అగ్ర కమెడియన్ జయప్రకాశ్ రెడ్డి మరణించారు. ఆయన మరణం నుండి..

Update: 2020-09-25 04:09 GMT

సినీపరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. పదిరోజుల కిందట టాలీవుడ్ అగ్ర కమెడియన్ జయప్రకాశ్ రెడ్డి మరణించారు. ఆయన మరణం నుండి తేరుకోకముందే రెండు రోజుల క్రితమే  మరో కమెడియన్ కోసూరి వేణుగోపాల్ కరోనాతో మరణించారు. ఇక ఆ విషాదం మరువకముందే మరో కమెడియన్ మరణ వార్త బయటకు వచ్చింది. కోవిడ్ -19 నుండి ఇటీవల కోలుకున్న ప్రముఖ కన్నడ నటుడు రాక్‌లైన్ సుధాకర్ గురువారం (సెప్టెంబర్ 24) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. కన్నడ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న సుధాకర్ కు షుగర్ లెవల్స్ పడిపోయాయి.. అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయనను ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు..

అయితే సుధాకర్ చికిత్స పొందుతూ నిన్న(గురువారం) ఉదయం 10 గంటలకు తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కాగా 1992 లో బెల్లి మోడగలు అనే చిత్రంతో తొలిసారిగా పరిశ్రమలో అడుగుపెట్టారు. సుధాకర్ రాక్‌లైన్ ప్రొడక్షన్స్ లో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు. దాంతో పనిచేసిన సంస్థనే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఇక ఆయన మరణంపై కన్నడ చిత్ర పరిశ్రమ షాక్ కు గురైంది. ఇదిలావుంటే మూడు నెలల క్రితం సుధాకర్ కరోనావైరస్ భారిన పడ్డారు. దాంతో కోవిడ్ ఆసుపత్రిలో చేరారు.. 15 రోజుల తరువాత సంక్రమణ నుండి కోలుకున్నారు. కానీ ఆయనకు మృత్యువు గుండెపోటు రూపంలో వచ్చింది. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖ నటులు సుధాకర్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు.

Tags:    

Similar News