Kangana Ranaut: వ్యాపార రంగంలో అడుగుపెట్టిన కంగనా.. హిమాలయాల్లో కేఫ్ ఓపెన్
సినీ, రాజకీయ రంగాల్లో బిజీగా ఉన్న కంగనా రనౌత్.. తాజాగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ది మౌంటెన్ స్టోరీ పేరుతో ఒక కేఫ్‌ని ప్రారంభించారు.
వ్యాపార రంగంలో అడుగుపెట్టిన కంగనా.. హిమాలయాల్లో కేఫ్ ఓపెన్
Kangana Ranaut: సినీ, రాజకీయ రంగాల్లో బిజీగా ఉన్న కంగనా రనౌత్.. తాజాగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ది మౌంటెన్ స్టోరీ పేరుతో ఒక కేఫ్‌ని ప్రారంభించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆ కేఫ్‌ని ప్రారంభించినట్టు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఇది నా చిన్న నాటి కల ది మౌంటెన్ స్టోరీ హిమాలయాల నడిబొడ్డున వికసించింది. ఈ కేఫ్ కేవలం భోజనం చేసే ప్రదేశం కాదు.. నా తల్లి వంట గది సువాసనలకి నిలయం అని చెప్పొకొచ్చారు కంగనా.
సంప్రదాయ హిమాచల్ ఫుడ్‌ను మోడ్రన్ అభిరుచులకు అనుగుణంగా అందించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇక తన తల్లి బాల్యంలో చెప్పిన పలు విషయాలను కంగనా గుర్తుచేసుకున్నారు. ఒక మహిళగా ఇంటి పనులకు ఎక్కువ సమయం కేటాయించాలని తన తల్లి ఎప్పుడూ చెబుతుండేవారన్నారు. ఊరగాయ, నెయ్యి తయారు చేయడం, కూరగాయలు ఎలా పండించాలో నేర్చుకోమని చెప్పేదని.. ఆ మాటలు తెలివితక్కవగా అనిపించేవని అన్నారు. అవి నేర్చుకోవడం వల్ల ఏమి ఉపయోగం ఉండదనుకున్నాను. దేశంలోనే చిన్న వయసులో ధనవంతురాలైన మహిళల్లో తాను ఒకదాన్ని అనుకునే దాన్నని.. కానీ ఆమె మాటలకు అర్థం ఏంటో ఇప్పుడు అర్థమైందన్నారు.
తాను కేఫ్ ప్రారంభించానని.. తన తల్లి ఎంతో సంతోషంగా ఉందన్నారు కంగనా. తాను పరిణితి చెందానని, తెలివైన దాన్ని అయ్యానని ఆమె భావిస్తోందని చెప్పారు. అయితే తాను కేఫ్ ప్రారంభించినట్టు కంగనా ట్వీట్ చేయడంతో అది చూసిన నెటిజన్లు, అభిమానులు, పలువురు ప్రముఖులు కంగనకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కంగనా రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక కంగనా సినిమాల విషయానికొస్తే.. పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. రీసెంట్‌గా ఎమర్జెన్సీ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఎమర్జెన్సీకి కంగనానే నిర్మాతగా, దర్శకురాలిగా వ్యవహరించి సినిమా పట్ల తనకున్న ఫ్యాషన్‌ని తెలియజేశారు.