OTT: ఓటీటీలోకి కంగనా ఇంట్రెస్టింగ్ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచో తెలుసా.?

OTT: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ఎమర్జెన్సీ. భారత మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ జీవితంలోని కొన్ని ఘట్టాలను ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు.

Update: 2025-02-22 04:07 GMT

OTT: ఓటీటీలోకి కంగనా ఇంట్రెస్టింగ్ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచో తెలుసా.?

OTT: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ఎమర్జెన్సీ. భారత మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ జీవితంలోని కొన్ని ఘట్టాలను ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. షూటింగ్ మొదలైన రోజు నుంచే వివాదాలకు కేరాఫ్‌గా మారిందీ మూవీ. ఈ సినిమా జనవరి 17వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. 1975 సమయంలో దేశంలో నెలకొన్న పరిస్థితులను ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదిలా ఉంటే థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కంగనా అధికారికంగా ప్రకటించింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఎమర్జెన్సీ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. మార్చిన 17వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని కంగనా అధికారికంగా ప్రకటించారు. మరి థియేటర్లలోకి వచ్చే ముందు కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ఈ సినిమా ఓటీటీలో ఏమైనా సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. అస్సాంను ఆక్రమించుకునేందుకు చైనా చేసిన ప్రయత్నాలను ఇందిరా గాంధీ ఎలా తిప్పికొట్టింది? ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం? సిమ్లా ఒప్పందం? దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎమర్జెన్సీ విధించడానికి కారణమయ్యాయి? ఆపరేషన్‌ బ్లూస్టార్‌ సమయంలో ఇందిర తీసుకున్న చర్యలు ఏమిటి? అన్న అంశాలను ఇందులో ప్రస్తావించారు. ఇందులో కంగనా.. ఇందిరాగాంధీగా నటించగా, అనుపమ్‌ ఖేర్‌, శ్రేయాస్‌ తల్పడే, విశాక్‌ నాయర్‌, మిలింద్‌ సోమన్‌ సహా దివంగత నటుడు సతీశ్‌ కౌశిక్‌ ముఖ్య పాత్రలు పోషించారు. కంగనా ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించడం విశేషం. 

Tags:    

Similar News