KP Chowdary: కబాలి నిర్మాత కేపి చౌదరి మృతి... కారణం అదేనా?
Tollywood Producer KP Chowdary's suicide case: టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి ఇక లేరు. గోవాలోని తన నివాసంలో ఆయన మృతి చెందారు. తెలుగు సినీ పరిశ్రమలో అందరూ ఆయన్ను సింపుల్‌గా కేపి చౌదరిగా పిలుస్తుంటారు. కేపీ చౌదరి మృతిపై విచారణ చేపట్టిన గోవా పోలీసులు... ఇది ఆత్మహత్య అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉంది.
ఖమ్మం జిల్లాకు చెందిన కేపి చౌదరి కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. పవన్ కల్యాణ్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ మూవీకి ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం లాంటి చిత్రాలను కూడా కేపీ చౌదరినే డిస్ట్రిబ్యూట్ చేశారు.
ఆ దెబ్బతో డిజప్పాయింట్ అయిన కేపి చౌదరి!
టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన డ్రగ్స్ రాకెట్ కేసులో కేపి చౌదరి పేరు కూడా వినిపించింది. ఇదే కేసులో 2023 లో కేపి చౌదరి అరెస్ట్ అయి బెయిల్ పై బయటికొచ్చారు. డ్రగ్స్ రాకెట్ కేసులో అరెస్ట్ అవడం కేపి చౌదరిని తీవ్రంగా కుంగదీసిందని తెలుగు సినీ పరిశ్రమలో ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
గోవాలో కేపీ చౌదరి కొత్త బిజినెస్
అరెస్ట్ ఘటనను అవమానంగా భావించిన కేపి చౌదరి ఆ తరువాత టాలీవుడ్ ను వీడి గోవాకు వెళ్లిపోయారు. అక్కడే ఒక క్లబ్ ఏర్పాటు చేసి కొత్త వ్యాపారం ప్రారంభించారు. ఆ వ్యాపారంలో నష్టాలు రావడం, మరోవైపు కేసు విచారణలతో ఆయన మానసికంగా కృంగిపోయారని తెలుస్తోంది. ఆ ఆవేదనతోనే కేపి చౌదరి సూసైడ్ చేసుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అసలు విషయాలు ఏవైనా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తరువాతే వెలుగుచూసే అవకాశం ఉంది.