Jyothika: తమిళ ఇండస్ట్రీలో ఒంటరి పోరు తప్పదు.. జ్యోతిక సంచలన కామెంట్స్ వైరల్
జ్యోతిక తమిళ ఇండస్ట్రీపై కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తాను 28 ఏళ్ల వయస్సులోనే ఇద్దరు పిల్లలకు తల్లినయ్యానన్నారు. ఆ తర్వాత కూడా భిన్నమైన పాత్రలు చేస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నాను.
తమిళ ఇండస్ట్రీలో ఒంటరి పోరు తప్పదు.. జ్యోతిక సంచలన కామెంట్స్ వైరల్
Jyothika: నటి జ్యోతిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు సినిమాల్లో నటించిన జ్యోతిక.. సూర్యతో పెళ్లి తర్వాత కూడా భిన్నమైన కథలు ఎంచుకుంటూ నటిగా కొనసాగుతున్నారు. తాజాగా డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఫిబ్రవరి 28 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఆ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక తమిళ ఇండస్ట్రీపై కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగాలంటే కష్టమన్నారు జ్యోతిక. తాను 28 ఏళ్ల వయస్సులోనే ఇద్దరు పిల్లలకు తల్లినయ్యానన్నారు. ఆ తర్వాత కూడా భిన్నమైన పాత్రలు చేస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నానని.. కానీ ఏ స్టార్ హీరో సరసన నటించే అవకాశం రాలేదన్నారు. ఇక్కడ వయస్సును పరిగణలోకి తీసుకుంటారు. సౌత్‌లోని అన్ని ఇండస్ట్రీల గురించి తాను చెప్పలేనని.. కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం వయస్సును అడ్డుగోడగా చూస్తారన్నారు. అలాంటప్పుడు మనమే కొత్త దర్శకులతో పని చేస్తూ మన కెరీర్‌ను నిర్మించుకోవాల్సి ఉంటుందన్నారు.
ఆ రోజుల్లో కె.బాలచందర్ లాంటి అనుభవజ్ఞులైన దర్శకులు, పెద్ద నిర్మాతలు మహిళల కోసం సినిమాలు తీసేవారు. ఈ రోజుల్లో అలా ఎవరూ తీయడంలేదు. అగ్ర హీరోలతో సినిమాలు తీసేవారు మాత్రమే ఉన్నారు. మహిళా ప్రాధాన్య సినిమాలు రావడం పూర్తిగా తగ్గిపోయాయి. లేడీ ఓరియంటెడ్ అనగానే బడ్జెట్ కూడా కుదించేస్తారు. వయసు పెరిగితే పరిగణనలోకి తీసుకోరు.. ఇది ఇంకో సమస్య. నటిగా రాణించడం కష్టం. ఎప్పుడూ ఒంటరి పోరాటం చేస్తూనే ఉండాలని చెప్పుకొచ్చారు జ్యోతిక. అయితే జ్యోతిక చెప్పిన విషయాలు నిజమేనంటూ నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే జ్యోతిక.. 1997లో డోలీ సజాకే రఖ్నా అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. వాలి సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఠాగూర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమ్యారు. ఆ తర్వాత చంద్రముఖి, మాస్ సినిమాలు చేశారు. హీరో సూర్యతో ఏడు సినిమాల్లో నటించారు. ఆ సమయంలో సూర్యతో ప్రేమలో పడ్డ జ్యోతిక 2006లో అతన్ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూతురు దియా, కుమారుడు దేవ్.