The Immortal Ashwatthama: బాలీవుడ్ స్టార్ హీరోని రీప్లేస్ చేయబోతున్న ఎన్టీఆర్?

The Immortal Ashwatthama: "ఆర్ఆర్ఆర్" సినిమా సూపర్ సక్సెస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

Update: 2023-04-16 15:00 GMT

The Immortal Ashwatthama: బాలీవుడ్ స్టార్ హీరోని రీప్లేస్ చేయబోతున్న ఎన్టీఆర్?

The Immortal Ashwatthama: "ఆర్ఆర్ఆర్" సినిమా సూపర్ సక్సెస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. టాలీవుడ్ లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఎన్టీఆర్ కి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న "వార్ 2" సినిమాలో కీలక పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఇంకా మొదలు కాలేదు కానీ అప్పుడే ఎన్టీఆర్ కి బాలీవుడ్ నుంచి మరొక భారీ బడ్జెట్ సినిమా ఆఫర్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ హీరోగా "ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ" అనే ఒక హై బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ సినిమా ప్లాన్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు రన్వీర్ సింగ్ స్థానంలో మరొక హీరోని ఎంపిక చేసుకోవాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని ఈ చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. కానీ రన్వీర్ సింగ్ హీరోగా ఉంటే ప్యాన్ ఇండియా రేంజ్ సినిమా అంతగా వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు.

పైగా రన్వీర్ సింగ్ ఈ మధ్యనే హీరోగా నటించిన "83", "జయేష్ భాయ్ జోర్దార్", "సర్కస్" వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఇప్పుడు రన్వీర్ సింగ్ స్థానంలో ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్ వంటి ప్యాన్ ఇండియా రేంజ్ ఉన్న స్టార్ హీరోలను ఎంపిక చేసుకుంటే బాగుంటుందని చిత్ర బృందం ప్లాన్ చేస్తూ ఉందట. ఇక ఈ సినిమాలో హీరో పాత్రకి ఎన్టీఆర్ చాలా బాగా సెట్ అవుతాడని అందుకే ఈ సినిమా ఎన్టీఆర్ కు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

Tags:    

Similar News