Jr NTR: ఫ్యాన్స్‌ కోసం ఎన్టీఆర్ సమావేశం.. చర్చనీయాంశంగా మారిన ప్రకటన

జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల కోసం ఓ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఎన్టీఆర్ టీమ్ ఓ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది. తనను కలుసుకోవాలని అభిమానులు ఎదురు చూస్తున్నారనే విషయం తన దృష్టికి వచ్చింది.

Update: 2025-02-05 08:20 GMT

ఫ్యాన్స్‌ కోసం ఎన్టీఆర్ సమావేశం.. చర్చనీయాంశంగా మారిన ప్రకటన

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల కోసం ఓ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఎన్టీఆర్ టీమ్ ఓ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది. తనను కలుసుకోవాలని అభిమానులు ఎదురు చూస్తున్నారనే విషయం తన దృష్టికి వచ్చింది. వారి ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలో వారి కోసం ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ఎన్ టీ ఆర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. వారి ఆనందమే కాదు సంక్షేమం కూడా తనకు ముఖ్యమన్నారు. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞలు తెలియజేస్తున్నానని.. తనను కలుసుకోవడానికి పాదయాత్రలు లాంటివి చేయొద్దని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.

అభిమానులతో జరిగే భేటీ వల్ల ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఫ్యాన్స్‌ను కలవడానికి ఏర్పాటు చేసే సమావేశానికి కొంత సమయం పడుతుందన్నారు. ఈ సమావేశం కోసం అభిమానులు ఓపికగా ఉండాలని ఆ ప్రకటనలో ఎన్టీఆర్ కోరారు. గతంలో కుప్పం నుంచి పాదయాత్ర చేసిన పలువురు ఫ్యాన్స్ హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అలా ఎవరూ చేయొద్దని సూచించారు.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ప్రకటన ఆసక్తిని మాత్రమే కాదు పలు సందేహాలను కలిగిస్తోంది. కారణం ఏమైనప్పటికీ ఎన్టీఆర్ ప్రకటన మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. సమావేశానికి ముందు తనను కలుసుకోవడానికి ఎలాంటి పాదయాత్ర చేయకూడదు. మీ ఆనందం మాత్రమే కాదు.. మీ భద్రత, సంక్షేమం ముఖ్యమన్నారు. ఈ ప్రకటన రాజకీయా వర్గాల్లో భారీ చర్చకు తెరతీసింది.

గత కొద్ది కాలంగా నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. ఈ సమావేశం ద్వారా తన అభిమానులతో ఏం మాట్లాడతారు..? ఇంతకీ అతని మనసులో ఉన్న ఆలోచన ఏంటి..? అభిమానులకు ఏదైనా దిశానిర్దేశం చేస్తారా.. ? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే భేటీ జరిగితే కానీ ఎన్టీఆర్ మనసులో ఉన్న భావం ఏమిటో బయటపడదంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News