Jani Master: జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్.. డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా..
Jani Master: తెలుగు సినిమా డాన్సర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాశ్ ఎన్నికయ్యారు.
Jani Master: జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్.. డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా..
Jani Master: తెలుగు సినిమా డాన్సర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాశ్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ ఘన విజయం సాధించారు. దీంతో జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుండి తొలగించినట్టైంది. ఇటీవల లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ బెయిల్ పై విడుదలయ్యారు.
ఈ కేసుతో జానీ మాస్టర్ చుట్టూ చెలరేగిన వివాదం నేపథ్యంలో తెలుగు సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆదేశాల మేరకు డ్యాన్సర్స్ అండ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ కు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో దాదాపు రెండు వందల ఓట్ల తో జోసెఫ్ ప్రకాష్ విజయం సాధించారు. అసోసియేషన్‌కు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రకాష్.. త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.