JIGRIS: 'జిగ్రీస్' నుంచి యూత్‌ను ఆకట్టుకునే మెలోడీ సాంగ్ 'మీరేలే' విడుదల!
JIGRIS: యంగ్ టాలెంట్ రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ అథేర్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫన్ ఎంటర్‌టైనర్ ‘జిగ్రీస్’
JIGRIS: 'జిగ్రీస్' నుంచి యూత్‌ను ఆకట్టుకునే మెలోడీ సాంగ్ 'మీరేలే' విడుదల!
JIGRIS: యంగ్ టాలెంట్ రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ అథేర్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫన్ ఎంటర్‌టైనర్ ‘జిగ్రీస్’ సినిమా ప్రమోషన్లలో వేగం పెంచింది. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో కృష్ణ వోడపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి 'మీరేలే' అంటూ సాగే రెండవ లిరికల్ సాంగ్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ పాట స్నేహితుల మధ్య ఉండే మధురమైన జ్ఞాపకాలను, ఫన్నీ సన్నివేశాలను గుర్తుచేసే మెలోడీ థీమ్‌తో యువతను ఆకట్టుకుంటోంది. దీనికి ముందు, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేసిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే, హీరో కిరణ్ అబ్బవరం మొదటి లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
నలుగురు యువకులు పాతకాలపు మారుతి కారులో గోవా వెళ్లాలని ప్లాన్ చేయడం, ఆ క్రమంలో వారు ఎదుర్కొనే సమస్యల చుట్టూ ఈ ఫన్ అండ్ ఎంటర్‌టైనర్ కథ అల్లుకుంది. యూత్‌ను ఆకట్టుకునే ఫన్నీ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రంపై రామ్ నితిన్ ఎంపిక చేసుకుంటున్న మంచి స్క్రిప్ట్‌ల కారణంగా అంచనాలు పెరుగుతున్నాయి. ‘జిగ్రీస్’ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.