Jigris: నవంబర్ 14న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్..

Jigris: యువతరం అభిరుచులకు తగ్గట్టుగా, వినోదం, స్నేహం, సంగీతం, భావోద్వేగాలు కలగలిసిన పక్కా యూత్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా జిగ్రీస్.

Update: 2025-10-27 06:08 GMT

Jigrees: నవంబర్ 14న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్..

Jigris: యువతరం అభిరుచులకు తగ్గట్టుగా, వినోదం, స్నేహం, సంగీతం, భావోద్వేగాలు కలగలిసిన పక్కా యూత్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా జిగ్రీస్. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ ఫేమ్ రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విడుదల చేయగా, అద్భుతమైన స్పందన లభించింది. కేవలం మూడు రోజుల్లోనే 2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, ఈ చిత్రం యువతలో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. జిగ్రీ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

యువత ప్రధానాంశంగా తెరకెక్కుతున్న జిగ్రీస్ సినిమా అంచనాలను భారీగా పెంచేస్తోంది. జిగ్రీస్ సినిమా అవుట్ అండ్ అవుట్ యూత్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. మ్యాడ్, వాట్ హాపెండ్ టు దిస్ సిటీ వంటి చిత్రాల తరహాలో ఈ సినిమా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విడుదల చేసిన టీజర్ కేవలం మూడు రోజుల్లోనే 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి, యూత్‌లో సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఈ చిత్రంలోని సంగీతం ఇప్పటికే యువతను బాగా ఆకర్షిస్తోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విడుదల చేసిన సినిమాలోని మొదటి పాట తిరిగే భూమికి కూడా మంచి స్పందన వచ్చింది. కమ్రాన్ సయ్యద్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది.

ఈ చిత్రంలో రామ్ నితిన్ తో పాటు రవిబాబు క్రష్ ఫేమ్ కృష్ణ బురుగాల, యూట్యూబర్ ధీరజ్ ఆత్రేయ, ది బర్త్‌డే బాయ్ ఫేమ్ మణి వక్కా కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్నారు. మౌంట్ మేరు పిక్ఛర్స్ బ్యానర్ పై కృష్ణ వొడపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

యువతతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మధ్యకాలంలో కామెడీ సినిమాలకు మంచి ఆదరణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జిగ్రీస్ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Tags:    

Similar News