ఆకలితో చచ్చిపోయేవాళ్లం.. అదంతా చిరంజీవి చలువే.. జేడీ లేఖ

మెగాస్టార్ చిరంజీవిని ప్రశంసలతో ముంచుతూ.. జేడీ చక్రవర్తి రాసిన ఓ లేఖ వైరల్ అవుతుంది.

Update: 2020-05-04 12:22 GMT
JD chakravarthy, Megastar Chiranjeevi(File photo)

మెగాస్టార్ చిరంజీవిని ప్రశంసలతో ముంచుతూ.. జేడీ చక్రవర్తి రాసిన ఓ లేఖ వైరల్ అవుతుంది. కరోనా వల్ల నష్టపోయిన సినీ కార్మికుల ఆకలి తీర్చడానికి కరోనా క్రైసిస్‌ ఛారిటీని (సీసీసీ) చిరంజీవి ఏర్పాటు చేసాడు. ఇండస్ట్రీలో నటీనటులంతా ముందుకు వచ్చారు. తమ వంతు విరాళం అందించారు. దీనిపై ఇప్పుడు జేడీ చక్రవర్తి ధన్యవాదాలు చెబుతూ చిరంజీవికి లేఖ రాసాడు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియలో చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ ఆ లేఖలో ఏముంది అంటే..

ప్రియమైన చిరంజీవి నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. ఎప్పట్నుంచో నేను మిమ్మల్ని నటుడిగా మాత్రమే ఇష్టపడేవాడ్ని. ఒకప్పుడు నా తోటి నటులంతా సాయంత్రం అయ్యే సరికి మీ దగ్గరికి వచ్చి సమయం గడపడానికి ఆసక్తి చూపించే వాళ్లు కానీ.. నాకెప్పుడూ మీ దగ్గరికి రావాలనే ఆలోచన కూడా రాలేదు. ఇది నేను మీకు బహిరంగంగా రాస్తున్న లేఖ కరోనా తీసుకొచ్చిన నష్టం మాటల్లో చెప్పలేం.. లాక్‌డౌన్ చేయడంతో సినిమా పరిశ్రమ కూడా ఎంతో కోల్పోయింది. మాటల్లో చెప్పలేనంతగా సినీ కార్మికులు నష్టపోయారు.

ఈ ఆపత్కాలంలో ఇతరుల్ని ఆదుకోవడానికి మీరు ముందుకు రావడం అద్భుతం. అభిమానులే కాదు అందరూ.. మిమ్మల్ని ఎందుకు అంతగా ఇష్టపడతారో నమ్ముతారనే దానికి మీరు ఇప్పుడు చేస్తున్న కరోనా క్రైసిస్ ఛారిటీ నిదర్శనం. మీరు నా దృష్టిలో మెగాస్టార్ కాదు అంతకంటే ఎక్కువ..చిరంజీవి గారు లేకపోయుంటే నిజంగానే ఆకలితో చచ్చిపోయేవాళ్లం అని పేర్కొన్నారు. అందరి ఆకలి తీర్చారు అదంతా చిరంజీవి చలువే అని జేడీ అన్నారు.

మీకు అన్నం పెట్టిన పరిశ్రమకు ఇప్పుడు మీరు ఇలా రుణం తీర్చుకుంటున్నానని నాతో చెప్పారు.. కానీ కార్మికుల పట్ల అది మీకున్న గౌరవం అని నేను భావిస్తున్నా. లాక్‌డౌన్ లేకపోతే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడ్ని. ఓ మంచి వ్యక్తిగా ఎలా మారాలనే విషయాన్ని మీ దగ్గర నేర్చుకోవాలి అని పేర్కొన్నారు. 




 



 



Tags:    

Similar News