Jayam Ravi: ఆ ప్రకటనతో షాక్ అయ్యాం.. విడాకులపై జయం రవి భార్య సంచలన ప్రకటన..!
Jayam Ravi: తమిళ స్టార్ హీరో జయం రవి అతని భార్య ఆర్తి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Jayam Ravi: ఆ ప్రకటనతో షాక్ అయ్యాం.. విడాకులపై జయం రవి భార్య సంచలన ప్రకటన..!
Jayam Ravi: తమిళ స్టార్ హీరో జయం రవి అతని భార్య ఆర్తి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ దాంపత్య బంధానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు ప్రకటన చేశారు. దీంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే తాజాగా ఈ వార్తలపై జయం రవి భార్య ఆర్తి స్పందించారు. తనకు తెలియకుండానే జయం రవి విడాకుల ప్రకటన చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు.
ఈ విషయంపై ఆమె స్పందిస్తూ... 'నా పర్మిషన్ లేకుండానే విడాకుల గురించి బహిరంగ ప్రకటన చేశారు. విడాకుల ప్రకటన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మేము 18 ఏళ్లుగా కలిసి ఉంటున్నాం, అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి లేకుండా ప్రకటించడం నన్ను చాలా బాధించింది. మా మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకోవాలని కొన్ని రోజులుగా చాలా ప్రయత్నించాను. నా భర్తతో మాట్లాడడానికి చాలా సార్లు ప్రయత్నించాను కానీ నాకు ఆ అవకాశం దక్కలేదు' అని పేర్కొన్నారు.
ఈ ప్రకటనతో, నేను.. నా పిల్లలు షాక్ అయ్యాం. బాధ కలుగుతున్నా, గౌరవంగా ఉండాలని ఉంది. అందుకే పబ్లిక్ గా ఈ విషయం గురించి మాట్లాడడం లేదు. నాపై తప్పుడుగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన వార్తలు విని చాలా బాధగా ఉంది. నా పిల్లలపై ఈ వార్తలు ప్రభావం చూపుతాయనే విషయం నాకు బాధ కలిగిస్తుంది. మా గోప్యతకు భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ ఆర్తి చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యాఖ్యలపై జయం రవి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.