OTT Movie: అపరిచితుల కారణంగా నాశనం అయిన కుటుంబం.. పుట్టిన రోజే ఆఖరు అయితే..

OTT Movie: కొందరు అపరిచితుల కారణంగా వ్యక్తులు కాదు కొన్ని కుటుంబాలే నాశనం అవుతుంటాయి. అమాయకులు వారి బారిన పడి సర్వ నాశనం అవుతారు.

Update: 2025-02-15 04:34 GMT

OTT Movie: అపరిచితుల కారణంగా నాశనం అయిన కుటుంబం.. పుట్టిన రోజే ఆఖరు అయితే..

OTT Movie: కొందరు అపరిచితుల కారణంగా వ్యక్తులు కాదు కొన్ని కుటుంబాలే నాశనం అవుతుంటాయి. అమాయకులు వారి బారిన పడి సర్వ నాశనం అవుతారు. అలాంటి అమాయకుల జీవితాలతో ఆడుకునే నేరస్తులకు ఉరిశిక్ష వేసినా చిన్నదే అవుతుంది. ఒక దొంగల ముఠా, ఓ కుటుంబం పై జరిపిన అఘాయిత్యంతో ఓ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఓటీటీలో సంచలనాలను నమోదు చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. 2021లో విడుదలైన ఈ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘జానోవర్’. రైహాన్ రఫీ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.

23 ఏప్రిల్ 2020న గాజీపూర్‌లో జరిగిన దోపిడీ, సామూహిక అత్యాచారం, హత్యల నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించారు. తస్కీన్ రెహమాన్ , రషెద్ మామున్ అపు, ఎలినా షమ్మీ, జంషెడ్ షమీమ్, ఫర్హాద్ లిమోన్, మున్మున్ అహ్మద్ వంటి వారు ఈ సినిమాలో నటించారు. ఆగస్టు 2020 లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 15రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. జనోవర్ 14 జనవరి 2021 న విడుదలైంది. మార్చి 2021 లో అత్యధికంగా వ్యూవర్స్ ను సాధించిన మూవీగా జానోవర్ నిలిచింది . ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతుంది.

కథలోకి వెళితే.. ఒక ఇంటి దగ్గరకు పోలీస్ వ్యాన్ వచ్చి ఆగుతుంది. లోపల ఆ పరిస్థితిలో ఉన్న ఆడవాళ్లను చూసి ఆ ఇన్స్పెక్టర్ షాక్ అవుతారు. హాల్లో ఒకరు, బెడ్రూంలో మరొకరు, కిచెన్ లో మరొకరు చాలా భయపడుతూ ఉంటారు. పోలీసులను చూడగానే దగ్గరకు రాకండి అంటూ ఏడుస్తుంటారు. వాస్తవానికి ఆ రోజు ఆ ఇంట్లో ఆవరిన్ అనే చిన్న పిల్ల బర్త్ డే ఉంటుంది. అమ్మాయి లేచి ఇంట్లో వాళ్ల పుట్టిన రోజు విషెష్ చెప్పాలని ఎదురు చూస్తుంటారు. ఇంతలో ఆ ఇంటిలోకి ఐదుగురు దొంగతనం కోసం దూరుతారు. ఆ ఇంట్లో ఆవరిన్ కి నూరి అనే అక్కతో పాటు తన తల్లి ఫాతిమా కూడా ఉంటుంది. ఆవరిన్ గొంతు మీద కత్తి పెట్టి దొంగలు బెదిరింపులకు దిగుతారు. ఫాతిమా భయపడి తమ దగ్గర ఉన్న డబ్బుతో పాటు నగలు కూడా దొంగలకు ఇచ్చేస్తుంది. ఇవి సరిపోవు అంటూ ఇంకా కావాలని బెదిరిస్తారు. వాళ్ల దగ్గర ఇంకేమీలేవని తెలుసుకొని, తినడానికి ఏమైనా చేయాలంటారు.

ఆ తర్వాత వీళ్లు ఓ దురాలోచన మనసులోకి వస్తుంది. కొత్త బట్టలు వేసుకుని డ్యాన్స్ చేయాలని అంటారు. వాళ్లు భయపడి అలాగే డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత ఆ ఐదుగురు కలిసి దారుణంగా వాళ్లపై అఘాయిత్యం చేస్తారు. నిజానికి పోలీసులు వచ్చేలోపే వీళ్లు చనిపోయి ఉంటారు. వాళ్లు బతికుంటే గుర్తుపట్టి పోలీసులకు చెప్తారని ఆ దొంగలు వాళ్లను చంపేస్తారు. ఆ నేరస్తుల్లో ఒక తండ్రి, కొడుకులు కూడా ఉంటారు. అక్కడ ఇదంతా అలా జరిగినట్లుగా ఇన్స్పెక్టర్ ఊహించుకుంటూ ఉంటాడు. ఈ క్రైమ్ జరిగిన ఆరు నెలల లోపే నిందితులను పోలీసులు పట్టుకుంటారు. ఇలాంటి నేరస్తులను బహిరంగంగా మరణ శిక్ష వేయాలని అందరూ అనుకుంటారు. ఈ మూవీని చూడాలనుకుంటే, ఫ్లెక్స్ (Plex) లో చూడొచ్చు. 

Tags:    

Similar News