Janhvi Kapoor: అల్లు అర్జున్‌తో జాన్వీ కపూర్ రొమాన్స్.. అట్లీ మూవీలో హీరోయిన్‌గా ఫిక్స్..?
అల్లు అర్జున్ గతేడాది పుష్ప2తో భారీ హిట్ అందుకున్నాడు. పుష్ప2 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో బన్నీ నెక్ట్స్ సినిమా ఏంటా అని చర్చ జరుగుతోంది.
అల్లు అర్జున్‌తో జాన్వీ కపూర్ రొమాన్స్.. అట్లీ మూవీలో హీరోయిన్‌గా ఫిక్స్..?
Janhvi Kapoor: అల్లు అర్జున్ గతేడాది పుష్ప2తో భారీ హిట్ అందుకున్నాడు. పుష్ప2 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో బన్నీ నెక్ట్స్ సినిమా ఏంటా అని చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్‌తో బన్నీ ఓ సినిమా చేయనున్నాడనే వార్త తెగ వైరల్ అయింది. కానీ ఆ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని.. అందుకే తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో బన్నీ సరసన బాలీవుడ్ బ్యూటీ, జాన్వీకపూర్ హీరోయిన్‌గా ఓకే చేసినట్టు టాక్ నడుస్తోంది.
త్రివిక్రమ్ స్క్రిప్ట్ భారీ బడ్జెట్‌తో కూడుకున్నదని సినీ వర్గాల టాక్. కథ ప్రాపర్‌గా లేకుండా సినిమా సెట్స్ పైకి వెళ్తే బడ్జెట్ విషయంలో తేడా రావచ్చని.. అందుకే త్రివిక్రమ్ టైం తీసుకున్నాడని సమాచారం. దీంతో అట్లీ మూవీ లైన్‌లోకి వచ్చింది. బన్నీతో సినిమా చేయాలని అట్లీ చాలారోజులుగా అనుకుంటున్నారు. వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో డిలే అవుతూ వస్తోంది. త్రివిక్రమ్ సినిమాకు టైం పట్టే అవకాశం ఉండడంతో అట్లీకి లైన్ క్లియర్ అయింది. బన్నీ, అట్లీ ఇద్దరి కాంబోలో హై యాక్షన్ సినిమా తెరకెక్కించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వివరాలను ప్రకటించనున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఓకే చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. దేవర సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద దేవర విజయం సాధించినప్పటికీ జాన్వీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదనే వార్తలు వచ్చాయి. దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. రెండో భాగంలో జాన్వీ పాత్రకు ఎక్కువ ప్రాధాన్య ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం తెలుగులో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌లో పరమ సుందరి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా కనిపించనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది జులైలో విడుదల కానుంది. తుషార్ జలోటా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.