Janhvi Kapoor: వరుస ప్లాపులు.. సినిమాలకు జాన్వీ బ్రేక్?
Janhvi Kapoor: జాన్వీ కపూర్ 2025లో సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. కొత్త చిత్రాలు సైన్ చేయకుండా రామ్‌చరణ్ పెద్ది చిత్రంపై దృష్టి పెడుతున్నారు. భారీ ఆఫర్లు వస్తున్నా బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. 2026 కోసం ప్లాన్ చేస్తున్నారట.

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సినీ కెరీర్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025లో కొత్త చిత్రాలు సైన్ చేయకుండా బ్రేక్ తీసుకోనున్నారు. గతంలో వరుస ఫ్లాపులతో ఆమె సినీ ప్రయాణం సవాళ్లను ఎదుర్కొంది. ఇప్పుడు రామ్‌చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో తన పాత్రను పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. అలాగే, ఎన్టీఆర్‌తో దేవర 2లో నటిస్తున్నారు.
భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ, జాన్వీ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ 2026లో బలమైన రీఎంట్రీ కోసం సన్నద్ధమవుతున్నారు. ఆమె నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాన్వీ ఈ బ్రేక్‌లో తన నటనను మరింత మెరుగుపరచుకుని, బలమైన కథలను ఎంచుకోవాలని భావిస్తున్నారు. 2026లో ఆమె ఎలాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి. సినీ అభిమానులు ఆమె కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.