ఆ లెజెండరీ యాక్టర్ తో సినిమా చేయాలని ఉంది అంటున్న జాన్వి కపూర్

* తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జాన్వి కపూర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది

Update: 2022-11-03 05:22 GMT

ఆ లెజెండరీ యాక్టర్ తో సినిమా చేయాలని ఉంది అంటున్న జాన్వి కపూర్

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇప్పుడు హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో కంటెంట్ ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఎంపిక చేసుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తోంది జాన్వికపూర్. తాజాగా ఇప్పుడు జాన్వి "మిలీ" అనే ఒక సర్వైవల్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ముత్తుకుటి జేవియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని జాన్వి తండ్రి బోని కపూర్ సొంత బానేర్ తో నిర్మించారు.

ట్రైలర్ తోనే ప్రేక్షకులను బాగా అలరించిన ఈ చిత్రం నవంబర్ 4 న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం బోనీ కపూర్ తో పాటు జాన్వి కపూర్ ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జాన్వి కపూర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించటం గురించి అడగగా జాన్వి కపూర్ ఒక ఆసక్తికరమైన జవాబు ఇచ్చింది. "నేను ఇంతకుముందు ఏం చెప్పానో మళ్లీ అదే చెప్తున్నాను.

ఎన్టీఆర్ సర్ తో పని చేయాలని ఎవరికి ఇష్టం ఉండదు? అలాంటి లెజెండ్ మరియు ఐకానిక్ యాక్టర్ తో పనిచేయటం నా డ్రీమ్," అని చెప్పుకొచ్చింది జాన్వి కపూర్. ఇక డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేయబోతున్నారు అని అడగగా త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాను అని అంటుంది జాన్వి. ఇక మలయాళం లో సూపర్ హిట్ అయిన "హెలెన్" అనే సినిమాకి హిందీ రీమేక్ గా తరాకెక్కుతున్న "మిలీ" నవంబర్ 11న థియేటర్ లలో విడుదల కాబోతోంది. సన్నీ కౌశల్ మరియు మనోజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.

Tags:    

Similar News