గ్రామ వాలంటీర్లు సమర్ధవంతంగా పనిచేయాలి : పవన్ కళ్యాణ్

కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే..

Update: 2020-03-29 16:53 GMT
Pawan Kalyan (File Photo)

కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే.. ఇక కేంద్ర విధించిన లాక్‌డౌన్‌ను ఆంధ్రప్రదేశ్‌ గ్రామ వాలంటీర్లు విజయవంతం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేశారు

"రాష్ట్రం పరీక్షా సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, గ్రామ వాలంటీర్లు తగిన స్థాయిలో పనిచెయ్యలేకపోతున్నారని సర్వత్రా విమర్శలు వినపడుతున్నాయి... ఎందుకంటే, ఇంకా కన్ని వేల మంది జనం బయటకి వచ్చి ,రేషన్‌ షాపులు ముందు క్యూలో నిలబడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో , ప్రతి ఇంటికి, రేషన్‌ సరుకులు మేమిస్తామని, నిత్యావసర వస్తువులు వాళ్ళకి అందచేస్తామని, వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం, గ్రామ వాలంటీర్లు, తమ బాధ్యతని ఇంకా బాగా నిర్వర్తించి, జనం రోడ్లు మీదకి రాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ బాధ్యతని వారు ఇలాంటి కష్ట కాలంలో ,మరింత బాధ్యతతో - కష్టపడి పనిచేస్తారని, ప్రధాని మోదీ గారు చెప్పిన లాక్‌ డౌన్‌ ని, వచ్చే నెల 14 వ తారీఖు దాక, విజయవంతం చేస్తారని, అందులో వాళ్ల పాత్ర కీలకం కావాలని , నేను మనస్సూర్సిగా ఆశిస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలాయ తాండవం ఆడుతుంది. ఆదివారం నాటికి అధికారికంగా 31,412 మంది చనిపోగా, 6,67,090 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ఈ వైరస్‌ నుంచి 134,700 మంది కోలుకున్నారు. ఇక భారత్ లో కూడా క్రమక్రమంగా కేసులు పెరుగుతున్నాయి. భారత్ లో 1000 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 25 మంది మృతి చెందారు.



Tags:    

Similar News