NBK108: శ్రీలీల క్యారెక్టర్ ఇదా..? అనిల్ రావిపూడి పక్కా ప్లాన్..

NBK 108: స్టార్ హీరోయిన్ కి బాబాయ్ కాబోతున్న బాలయ్య

Update: 2023-04-03 15:30 GMT

NBK 108: "అఖండ", "వీరసింహారెడ్డి" వంటి రెండు వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో బాలయ్య భార్య పాత్రలో కనిపించబోతోంది. యువ హీరోయిన్ శ్రీ లీల ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించబోతోంది అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అసలు తండ్రి పాత్ర చేయడానికి అందులోనూ ఒక స్టార్ హీరోయిన్ కి తండ్రిగా నటించడానికి బాలకృష్ణ ఎలా ఒప్పుకున్నారు అని అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీ లీల బాలకృష్ణ సొంత కూతురి లాగా కనిపించడం లేదట. బాలయ్యని శ్రీ లీల బాబాయి అని పిలవబోతోందట. చిన్నప్పుడే తన తల్లిదండ్రులని కోల్పోయిన శ్రీ లీల పాత్ర కి తన బాబాయి అయిన బాలకృష్ణ అండగా ఉంటారట. సినిమా మొత్తం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో బాబాయ్ కూతురి మధ్య బంధాన్ని చాలా బాగా చూపించినట్లు సమాచారం. అంతేకాకుండా అనిల్ రావిపూడి శ్రీ లీల తో ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ని కూడా ప్లాన్ చేశారట. కేవలం ఈ ఒక్క పాట షూటింగ్ కోసమే నాలుగైదు కోట్లు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రామోజీ ఫిలిం సిటీ లో ఒక భారీ సెట్ ని కూడా ఏర్పాటు చేశారట. మంచి కెమెరాలు మరియు మెరుగైన టెక్నాలజీని కూడా వాడి ఈ పాట షూటింగ్ జరగబోతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News