OTT Movie: తండ్రి కోసం దెయ్యాలను వేటాడే కూతురు.. ప్రతి సీను సీనుకు తడిచిపోవాల్సిందే..!
OTT Movie: ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ సినిమాలు చూడాలంటే జడుసుకోవాల్సిందే. ఒంటరిగా చూస్తే గుండె ఆగిపోవాల్సిందే.
OTT Movie: తండ్రి కోసం దెయ్యాలను వేటాడే కూతురు.. ప్రతి సీను సీనుకు తడిచిపోవాల్సిందే..!
OTT Movie: ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ సినిమాలు చూడాలంటే జడుసుకోవాల్సిందే. ఒంటరిగా చూస్తే గుండె ఆగిపోవాల్సిందే. అలా వెన్నులో వణుకు పుట్టించే మరో హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. హారర్ సినిమా ప్రేమికులు తప్పక చూడాల్సిన ఈ మూవీ ‘తఘుట్’ (Thaghut). నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ భయంకరమైన హారర్ థ్రిల్లర్‌కి బాబీ ప్రాసేటో దర్శకత్వం వహించారు. యస్మిన్, అర్బని యసీజ్, రియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథలో ఓ అమ్మాయి తన తండ్రి వారసత్వాన్ని పొందే క్రమంలో ఘోర అనుభవాలను ఎదుర్కొంటుంది. అతిలోక శక్తులతో మంత్రాల సహాయంతో దయ్యాలను వదిలించే ఓ మంత్రగాడి చుట్టూ కథ తిరుగుతుంది.
హీరోయిన్ అనాధ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. టీవీలో వచ్చే ఓ ప్రోగ్రామ్‌ను ఆమె ఎంతో ఆసక్తిగా చూస్తుంటుంది. ఆ ప్రోగ్రాంలో అభ అనే మంత్రగాడు తన మంత్రాలతో దయ్యాలను వదిలిస్తూ, అనారోగ్య సమస్యలను నయం చేస్తుంటాడు. హీరోయిన్ కూడా అతని లాగా అవ్వాలని కోరుకుంటుంది. ఒకరోజు అభ ఆమె కలలోకి వచ్చి "నీవు రావాల్సిన సమయం వచ్చింది" అంటూ చెప్తాడు. అంతే కాదు, తన గొంతు కోసుకొని చనిపోతాడు. అది కలే అనుకుంటుంది కానీ.. ఆ రోజు టీవీలో అభ నిజంగానే చనిపోయిన వార్త వస్తుంది. హీరోయిన్ షాక్‌కు గురవుతుంది. తన తండ్రే అభ అని తెలిసిన తర్వాత అతనిని చూడటానికి తన ఫ్రెండ్స్‌తో కలిసి బయలుదేరుతుంది.
తండ్రి స్వగృహానికి చేరుకున్న తర్వాత, "ఇక నువ్వే నీ నాన్న వారసురాలు" అని అభ అసిస్టెంట్ ఆమెకు తెలియజేస్తాడు. అదే సమయంలో ఇంట్లో దయ్యాలతో ఆమెకు ఆహ్వానం లభిస్తుంది. భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. ఫ్రెండ్స్ భయంతో వెళ్ళిపోవాలని భావించినా, హీరోయిన్ మాత్రం అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటుంది. తండ్రి అడుగుజాడల్లో ఆమె నడుస్తుందా? ఈ అసలైన భయం ఏంటి? దయ్యాలతో ఆమె పోరాడుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెట్ఫ్లిక్స్‌లో ‘తఘుట్’ తప్పక చూడాలి.
రాత్రిపూట ఒంటరిగా చూస్తే?
ఈ హారర్ థ్రిల్లర్‌కి టెర్రిఫైయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భయంకరమైన విజువల్స్, ఆకట్టుకునే కథనం ప్రత్యేక ఆకర్షణలుగా మారాయి. ఈ సినిమా రాత్రిపూట ఒంటరిగా చూడడానికి గుండె ధైర్యం ఉండాలి. హారర్ సినిమాల ప్రేమికులకు ఇది నిజమైన విందుగా మారనుంది. భయపడే వాళ్లు రాత్రిపూట ఒంటరిగా చూసే ప్రయత్నం చేయొద్దు. నిజమైన హారర్ థ్రిల్లర్ అనుభూతిని కోరుకునేవారికి ‘తఘుట్’ మిస్ కాకుండా చూడాల్సిన మూవీ.