Priyanka Chopra: భారత్ కష్టాల్లో ఉంది.. తోచినంత సాయం చేయండి- ప్రియాంక చోప్రా
Priyanka Chopra: భారత్‌ను ఆదుకునేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావాలంటూ గ్లోబల్ స్టార్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.
ప్రియాంక చోప్రా( ఫైల్ ఇమేజ్ )
Priyanka Chopra: భారత్‌ను ఆదుకునేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావాలంటూ గ్లోబల్ స్టార్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. తమకు తోచిన విధంగా సాయం చేయాలనీ విన్నవించారు. దేశంలో పరిస్థితి ఘోరంగా మారిందని విరాళాలు ఇవ్వాలని కోరింది. అందరూ సురక్షితంగా లేనంత కాలం ఏ ఒక్కరు సురక్షితం కాదని.. ఆపదలో ఉన్న భారత్‌ను ఆదుకునేందుకు మీ వనరులను, శక్తిని ఉపయోగించి సహకరించాలని కోరారు. దీనికి సంబంధించి ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు.