Income Tax Raids: తాప్పీ, అనురాగ్ కశ్యప్ ఇళ్లపై ఐటీ దాడులు
Income Tax Raids: ముంబయిలో కొందరు సినీ ప్రముఖుల ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
హీరోయిన్ తాప్సీ, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (ఫొటోస్ హన్స్ ఇండియా)
Income Tax Raids: ముంబయిలో కొందరు బాలీవుడ్ సినీ ప్రముఖుల ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హీరోయిన్ తాప్సీ, ప్రొడ్యూసర్ మధు మంతెన, డైరెక్టర్ వికాస్ బెహల్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
అలాగే డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌కు చెందిన ఫాంటమ్ ఫిల్మ్స్, టాలెంట్ హంట్ కంపెనీ ఆఫీసుల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు. పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముంబయి, పుణెల్లో ఏకకాలంలో 20 చోట్ల తనిఖీలు చేపట్టారు.