Sara Arjun: ప్రభాస్, విజయ్‌లను వెనక్కినెట్టి టాప్‌లో నిలిచిన ధురంధర్ బ్యూటీ..!
Sara Arjun: నటి సారా అర్జున్ (Sara Arjun) తాజా చిత్రం ‘ధురంధర్’ ఘనవిజయంతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారారు.
Sara Arjun: ప్రభాస్, విజయ్‌లను వెనక్కినెట్టి టాప్‌లో నిలిచిన ధురంధర్ బ్యూటీ..!
Sara Arjun: నటి సారా అర్జున్ (Sara Arjun) తాజా చిత్రం ‘ధురంధర్’ ఘనవిజయంతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారారు. ఈ సినిమా సక్సెస్‌తో పాటు ఆమె తాజాగా సాధించిన ఒక అరుదైన రికార్డు ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రముఖ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ (IMDB) ప్రతి వారం విడుదల చేసే 'ప్రజాదరణ పొందిన భారతీయ సెలబ్రిటీల' జాబితాలో సారా అర్జున్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె పాన్ ఇండియా స్టార్లను సైతం వెనక్కి నెట్టడం విశేషం.
అగ్ర హీరోలను బీట్ చేసి సారా అర్జున్ టాప్ 1లో నిలిచారు. ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ విజయ్ 8వ స్థానంలో, రెబల్ స్టార్ ప్రభాస్ 19వ స్థానంలో నిలిచారు. అగస్త్య నంద 12వ స్థానంలో, భాగ్యశ్రీ బోర్సే 15వ స్థానంలో ఉన్నారు.
‘ధురంధర్’తో బాలీవుడ్ ఎంట్రీ
బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్, ‘ధురంధర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా యాలినా జమాలి పాత్రలో నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుండటంతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది.
వివాదంపై స్పష్టత
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాకేశ్ బేడీ, సారా అర్జున్‌ను ముద్దుపెట్టుకోవడం సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. అయితే దీనిపై రాకేశ్ బేడీ స్పందిస్తూ.. తండ్రి తన కుమార్తెను ముద్దుపెట్టుకున్నట్లుగా, ఆప్యాయతతోనే ఆమెను పలకరించానని క్లారిటీ ఇచ్చారు.