Ileana D'Cruz: టాలీవుడ్ లో ఇలియానా థర్డ్ ఇన్నింగ్స్ షురూ?

Ileana D'Cruz: ఇలియానా ఇండస్ట్రీ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యిందా?

Update: 2023-04-06 11:00 GMT

Ileana D'Cruz: టాలీవుడ్ లో ఇలియానా థర్డ్ ఇన్నింగ్స్ షురూ?

Ileana D'Cruz: ఇలియానా ఇండస్ట్రీ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యిందా? అప్పుడప్పుడైనా ఇన్ స్టా గ్రామ్ లో కనిపించేది. కాని ఇప్పుడు ఆ జోరు కూడా లేదు. కాజల్ పెళ్లై, తల్లయ్యాక కూడా బోల్డ్ గా దూకుడు పెంచింది. తమన్నా లెక్కమార్చింది. ఈ బ్యాచ్ మెట్స్ లో ఒక్క ఇలియాన లెక్కే తేలకుండా ఉంది.. అసలు ఈ గోవా బ్యూటీ ఏం చేస్తున్నట్టు? ఎటుపోయినట్టు..?

ఇలియాన నిజానికి టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ బ్యాచ్ లో నెంబర్ వన్ అనిపించుకున్న లేడీ. పూజా హెగ్డే ఎన్ని హిట్లు కొట్టినా మరో ఇలియానా అనిపించుకున్న తనరేంజ్ లో ఇండస్ట్రీని ఊపేయలేకపోయింది. అలాంటి ఈ గోవా బ్యూటీ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. 16 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇలియానాకు ఇప్పుడు వయసు 35 దాటింది. సో కెరీర్ ఎండ్ స్టేజ్ లో ఇంకా అడ్రస్ మిస్ అంటే ఎలా అనే సెటైర్లు వస్తున్నా, తోటి హీరోయిన్లతో పోలిస్తే ఇలియాన ప్రస్థావన ఇండస్ట్రీలో రాకమానదు.

ఇలియాన కాంటెంపరరీస్ అయిన తమన్నా, కాజల్ ఏజ్ బార్ స్టేజ్ లోకూడా ఇంకా సినీజర్నీచేస్తూనే ఉన్నారు. అలాచూస్తే ఇలియానా అడ్రస్ లేదు. సౌత్ ని ఏలిన ఇలియాన కెరీర్ ఊపుమీదున్న టైంలో బాలీవుడ్ వెళ్లి ఫ్యూచర్ కి పంచర్ చేసుకుందనే కామెంట్లు కూడా అప్పట్లో వినిపించాయి. ఇలియానా ప్రజెంట్ బాలీవుడ్ లో రెండు మూడేళ్లకు ఒక మూవీ చేయటమే గగనమైపోయింది. అన్ ఫేయిర్ అండ్ లవ్లీ మూవీతో దండెత్తేందుకు రెండేళ్లుగా కసరత్తులు చేస్తోంది. ఐతే టాలీవుడ్ లో ఓ వెబ్ సీరీస్ తో థర్డ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేస్తోంది.

ఇలియానా దేవుడు చేసిన మనుషులు తో టాలీవుడ్‌కి ఫస్ట్ టైం గుడ్ బై చెప్పింది. బాలీవుడ్ లో పంచ్ పడ్డాక అమర్ అక్బర్ ఆంటోనీతో సెకండ్ ఇన్నింగ్స మొదలు పెట్టి మళ్లీ బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు తెలుగు వెబ్ సీరీస్ తో థర్ట్ ఇన్నింగ్స్ షురూ చేసేలా ఉంది. 

Tags:    

Similar News