ముగిసిన ఇళయరాజా, ప్రసాద్ స్టూడియోస్ వివాదం..

ఇళయరాజా మరింత మనస్తాపానికి లోనయ్యాడని తెలుస్తుంది.

Update: 2020-12-29 12:20 GMT

ప్రసాద్‌ స్టూడియో యాజమాన్యం ప్రత్యేక రికార్డింగ్‌ స్టూడియో కట్టించారు. కొన్నేళ్ల క్రితం ఇరువర్గాల మధ్య వచ్చిన ఘర్షణతో దాన్ని వెంటనే ఖాళీ చేయాల్సిందిగా ఇళయరాజాపై ఒత్తిడి పెరిగింది. దానికి ఇళయరాజా నిరాకరించాడు. మద్రాసు హైకోర్టులో ఈ వివాదంపై రెండేళ్లుగా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. దీంతో ఇళయారాజా వెనక్కితగ్గాడు.

ఇళయారాజా ఇప్పుడు తన వాయిద్యాలు తీసుకెళ్లడానికి మాత్రం స్టూడియోలోని తన సంగీత పరికరాలు, అవార్డులను తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. అయితే అక్కడ తను ధ్యానం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మరో పిటిషన్‌ కోర్టులో దాఖలు చేశారు. స్టూడియో యాజమాన్యం దానికి వ్యతిరేకించింది. ఆ తర్వాత కొన్ని షరతులతో అంగీకరించింది. ధ్యానం అనంతరం తన సంగీత పరికరాలు తీసుకెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని స్టూడియో యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది.

కోర్టు ఆదేశాల మేరకు ఇళయరాజా డిసెంబర్ 29 ఉదయం ప్రసాద్‌ స్టూడియోకు వస్తారని ప్రకటన విడుదలైంది. ఇళయరాజా వినియోగించే పరికరాలను మరో గదిలోకి తరలించి ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆయన  మనస్తాపానికి లోనయ్యాడని తెలుస్తుంది. ఏళ్లపాటు సాగిన ఈ వివాదం ఎట్టకేలకు ముగింపు పలికింది.

Tags:    

Similar News