సహాయం కోసం వెళ్లి బుక్కయ్యను.. ఆ యాక్సిడెంట్ కి కారణం నేను కాదు బాబోయ్! వాపోతున్న హీరోయిన్!

Update: 2019-10-08 05:57 GMT

గత శనివారం అర్థరాత్రి చెన్నైలోని నుంగంబాక్కంలో తాను యాక్సిడెంట్ చేసినట్టు వచ్చిన వార్తలను బిగ్‌ బాస్ మాజీ కంటెస్టెంట్, నటి యషికా ఆనంద్ ఖండించింది. ఓ పార్టీలో పూటుగా తాగి, స్నేహితులతో కలిసి కారులో వస్తున్న యషికా, భరత్ అనే డెలివరీ బాయ్‌ ని తన కారుతో ఢీకొట్టిందని, వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే, తాను ఆ యాక్సిడెంట్ చేయలేదని ఆమె చెప్పింది. ఆ ప్రమాదం జరిగిన సమయంలో బాధితుడ్ని కాపాడటానికి అతనిని ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్టు ఆమె వివరించింది. తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అసత్యమని.. వాటిని ఆపు చేయాలనీ ఆమె కోరింది. సహాయం చేయడానికి వెళ్లి తాను ఇరుక్కుపోయానని ఆమె వాపోతోంది. 

బిగ్ బాస్ సీజన్ 2 తమిళ్ తో యశికా ప్రఖ్యాతి పొందింది. ఈమె నటించిన సినిమా 'ఇరిట్టు అరైయిల్ మురట్టు కుత్తు' విజయవంతం అయింది.


Tags:    

Similar News