Rahul Sipligunj: ఈ గల్లీబాయ్‌ పేరు అంతర్జాతీయ స్టేజ్‌పై వినిపించింది.. జీవితంలో తనకు దక్కిన..

Rahul Sipligunj: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సినిమా

Update: 2023-01-11 08:03 GMT

Rahul Sipligunj: ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన RRR సినిమా

Rahul Sipligunj: పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ మూవీ ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. జాతీయ స్థాయిలో కాకుండానే అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ట్రిపుల్ ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు ప్రతిష్టాత్మక పురస్కారం గోల్డెన్ గ్లోబ్ కైవసం చేసుకుంది. నాటు నాటు పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా.. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ పాడారు. ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు... నాటు..కి గాను కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అందుకోవడంపై ప్రజలు ట్విటర్‌లో అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

ఈ అవార్డు రావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌. 'నాటు నాటు' పాటకు థియేటర్లో తానూ పేపర్లు ఎగరేసి రచ్చ రచ్చ చేశానని గుర్తు చేసుకున్నారు. గల్లీ నుంచి వచ్చిన తన పేరు గోల్డెన్‌ గ్లోబ్‌ వేదికపై వినిపించడం.. జీవితంలో తనకు దక్కిన గొప్ప గౌరవంగా రాహుల్ చెప్పారు. ఆర్ఆర్‌ఆర్‌ చిత్రం ఆస్కార్‌ బరిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు. 

Tags:    

Similar News