War 2: వార్‌2 టీజ‌ర్‌పై స్పందించిన హృతిక్ గ‌ర్ల్ ఫ్రెండ్‌.. ఏమ‌న్నారంటే

War 2: ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘వార్ 2’ టీజర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14, 2025న థియేటర్లలో విడుదల కానుంది.

Update: 2025-05-20 10:31 GMT

ఈ నేప‌థ్యంలో తాజాగా విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై ఒక్క‌సారిగా అంచ‌నాల‌ను పెంచేసింది. ఈ టీజ‌ర్‌లో హృతిక్ రోషన్ బలమైన శరీరంతో, శత్రువును ఎదుర్కొంటూ కనిపించగా, ఎన్టీఆర్ అదే స్థాయిలో మిస్టీరియస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకే హైలెట్‌గా ఉండేలా క‌నిపిస్తోంది.

హృతిక్ గ‌ర్ల్ ఫ్రెండ్ రియాక్ష‌న్

ఈ టీజర్‌పై హృతిక్ గర్ల్‌ఫ్రెండ్ సబా అజాద్ స్పందించారు. ఫైర్ ఇమోజీల‌తో కూడిన పోస్ట్ చేస్తూ.. "Let's gooooo!!" అంటూ కామెంట్ చేసింది. ఇది అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపింది.

ఇక టీజ‌ర్ విష‌యానికొస్తే.. టీజర్‌లో హృతిక్ రోషన్ నటించిన కబీర్ పాత్రను లక్ష్యంగా చేసుకుని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది: "నా దృష్టి ఎప్పటినుంచో నిన్నే చూస్తోంది కబీర్… ఇండియాకి బెస్ట్ సొల్జర్ నువ్వే… కానీ ఇక కాదు! నువ్వు నన్ను అసలు చీమ అనుకున్నావేమో… కానీ ఇప్పుడు తెలుసుకుంటావ్. యుద్ధానికి సిద్ధ‌మ‌వ్వు అని చెప్పిన డైలాగ్ అద్భుతంగా ఉంది.

ఇక కియారా అద్వానీ గ్లామ‌ర‌స్ లుక్‌లో అట్రాక్ట్ చేసింద‌ని చెప్పాలి. బికినీ లుక్‌లో మెస్మ‌రైజ్ చేసింది. ఇక ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఆగ‌స్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tags:    

Similar News