Hrithik Roshan: లైగర్ బదులు టైగర్ ను రంగంలోకి దింపిన హృతిక్ రోషన్

Hrithik Roshan: స్పై యూనివర్స్ లో ఛాన్స్ కొల్పోయిన విజయ్ దేవరకొండ

Update: 2023-04-07 16:00 GMT

Hrithik Roshan: లైగర్ బదులు టైగర్ ను రంగంలోకి దింపిన హ్రితిక్ రోషన్ 

Hrithik Roshan: బాలీవుడ్ లో ఇప్పుడు స్పై యూనివర్స్ పేరు బాగా వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన "వార్" మరియు ఈ మధ్యనే షారుక్ ఖాన్ హీరోగా నటించిన "పటాన్" సినిమాలు ఇప్పటికే స్పై యూనివర్స్ లో భాగమయ్యాయి. ఇప్పుడు "వార్ 2" మరియు "టైగర్ 3" సినిమాలు కూడా స్పై యూనివర్స్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

"వార్ 2" సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇప్పుడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను రంగం లోకి దింపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న "వార్ 2" సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నిజానికి "లైగర్" సినిమా విడుదల కి ముందు స్పై యూనివర్స్ లో భాగంగా మార్చేందుకు చిత్రబృందం విజయ్ దేవరకొండ ను అనుకున్నారట.

కానీ "లైగర్" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ దేవరకొండ కి బదులు "వార్ 2" సినిమాలో నటించడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. "నాటు నాటు" పాటకి ఆస్కార్ కూడా లభించడంతో ఎన్టీఆర్ పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుగతోంది. మరి ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News