The Descent OTT: టాప్ హర్రర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్..!

The Descent OTT: 2005లో విడుదలైన ఈ హర్రర్.. టెర్రర్ సినిమా అప్పట్లో ప్రపంచాన్నే ఒక ఊపు ఊపింది.

Update: 2025-07-07 09:02 GMT

The Descent OTT: టాప్ హర్రర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్..!

The Descent OTT: 2005లో విడుదలైన ఈ హర్రర్.. టెర్రర్ సినిమా అప్పట్లో ప్రపంచాన్నే ఒక ఊపు ఊపింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

డూమ్స్‌ డే, మెల్ బాయ్ వంటి భారీ సినిమాలను రూపొందించిన నీల్ మార్షల్ దర్శకత్తం వహించిన ద డీసెంట్ సినిమా 2005లో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో ప్రపంచాన్నే వణికించింది. షానా మక్డోనాల్డ్, నటాలీ మెన్డోజా, అలెక్స్ రీడ్ లు కీలక పాత్రల్లో పోషించారు. ఈ చిత్రం వచ్చి రెండు దశబ్ధాలు అయింది. అయినా ఇప్పటికీ ఈ సినిమా థ్రిల్లర్ ప్రేక్షకులకు క్రేజ్. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

2005లో ద డీసెండ్ వచ్చింది. ఆ తర్వాత డీసెంట్ 2 కూడా వచ్చింది. కానీ ద డీసెంట్ సినిమా ఇప్పటికీ వన్ ఆఫ్‌ ది బెస్ట్ స్కేరియస్ట్ థ్రిల్లర్ సినిమాగా పేరుతెచ్చుకుంటూనే ఉంది.

గంటన్నర పాటు నిడివి ఉండే ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్గా, సస్పెన్స్గా, థ్లిల్లింగ్‌గా ఉంటుంది. తన ఫ్రెండ్‌ను డిప్రెషన్‌ నుంచి బయటకు తీసుకురావాలని ఒక ఐదుగురు ఫ్రెండ్స్ ఒక టూర్ వెళతారు ఇంతకీ ఆ టూర్ ఎక్కడంటే సిటీకి దూరంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో ఉన్న ఒక గుహకు వెళతారు. కానీ వారు ఒక గుహ లోపలికి వెళ్లాల్సింది...మరొక గుహలోపలికి వెళ్లిపోతారు. అప్పుడు వాళ్లంతా చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటరు. రకరకాల క్రీచర్స్ వీరిపై దాడి చేస్తాయి. ఇలా గంటన్నర పాటు ఫుల్ టెన్షన్‌తో ఈ సినిమా సాగుతోంది. అయితే ఎంతమంది బయటపడ్డారన్నదే ఈ సినిమా సస్పెన్స్.

ది డీసెంట్ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ది డీసెంట్ సినిమా నిజంగా డీసెంట్‌గా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. అయితే కొన్ని సన్నివేశాలు చాలా భయంకరంగా, హింసాత్మకంగా ఉంటాయి. కాబట్టి, చిన్న పిల్లలు, పెద్దవాళ్లు చూడకుండా ఉంటేనే మంచిది.

Tags:    

Similar News