OTT Movie: మేక పిల్లకి జన్మనిచ్చే అమ్మాయి.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఇంట్రెస్టింగ్ హారర్‌ మూవీ..!

OTT Movie: హారర్‌ మూవీస్‌ను ఇష్టపడే వారు మనలో చాలా మంది ఉంటారు. మరీ ముఖ్యంగా ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలకు డిమాండ్‌ ఎక్కువైంది.

Update: 2025-02-12 08:59 GMT

OTT Movie: మేక పిల్లకి జన్మనిచ్చే అమ్మాయి.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఇంట్రెస్టింగ్ హారర్‌ మూవీ..!

OTT Movie: హారర్‌ మూవీస్‌ను ఇష్టపడే వారు మనలో చాలా మంది ఉంటారు. మరీ ముఖ్యంగా ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలకు డిమాండ్‌ ఎక్కువైంది. హాలీవుడ్‌ మూవీస్‌ సైతం తెలుగులోకి డబ్‌ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ఇంట్రెస్టింగ్‌ హారర్‌ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటి.? ఎందులో స్ట్రీమింగ్‌ అవుతోంది.? లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

2024లో అమెరికాలో థియేటర్‌లోకి వచ్చిన అజ్రెల్‌ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ.ఎల్‌ కాట్జ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమారా వీవింగ్, విక్ కార్మెన్ సోన్నె,నాథన్ స్టీవర్ట్జ నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ విషయానికొస్తే..భూమిపై సంభవించిన ఓ విపత్తులో ప్రపంచం చాలా వరకు నాశనం అవుతుంది. కొంతమంది మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. వారు అడుగడుగునా చిన్న చిన్న స్థావరాలు ఏర్పాటు చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అలా ఏర్పాటైన ఒక ప్రదేశంలో కొంతమంది భగవంతుడిని అత్యంత భక్తితో ఆరాధిస్తూ ఉంటారు. ఈ సమాజంలో మాట్లాడటం నిషిద్ధం, అందుకే వారు తమ గొంతును ఉపయోగించకుండా జీవిస్తుంటారు. ఈ వింత ప్రపంచంలోకి అజ్రెల్, కేనన్ అనే ఇద్దరు ప్రేమికులు అడుగుపెడతారు.

అయితే అక్కడి సమాజం వారిని బంధించి, ఒక్కొక్కరిని విడదీసి క్రియేచర్లకు బలి ఇవ్వాలని చూస్తుంది. దీంతో కేనన్‌ వారి నుంచి తప్పించుకొని పారిపోతాడు. అయితే, ఆ భయంకరమైన సమాజం ఆమెను వదిలిపెట్టదు. ఆమెను వెంబడిస్తూ వెళ్తారు. అజ్రెల్ తన ప్రియుడిని కాపాడేందుకు తిరిగి అతనిని వెతుక్కుంటూ ప్రయాణం చేస్తుంది. కానీ ఓ ప్రదేశంలో అతని వస్తువులు కనబడతాయి. ఆ విషయాన్ని గమనించి వెళ్లి చూసే సరికి, కేనన్‌ ని ఘోరంగా హత్యకు గురై ఉంటాడు.

ఈ దారుణానికి కారకులైన వారిని వదిలిపెట్టకూడదని అజ్రెల్ కఠిన నిర్ణయం తీసుకుంటుంది. ఆమె తిరిగి క్రియేచర్ల స్థావరానికి వెళ్లి, వారిపై పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఇదే సమయంలో, ఆ ప్రదేశంలో ఒక అమ్మాయి మేక పిల్లకి జన్మనిస్తుంది. ఆశ్చర్యకరంగా, క్రియేచర్స్ అందరూ ఆ మేక పిల్లని తమ నాయకుడిగా పూజించేందుకు సిద్ధమవుతారు. అజ్రెల్ చివరికి తన ప్రతీకారాన్ని తీర్చుకుందా.? లేదా తెలియాలంటే.. ఈ సినిమా చూడాల్సిందే.

Tags:    

Similar News