విలక్షణ నటునకు ప్రతిరూపం చలం..ఆఖరి రోజుల్లో విషాదంతో ముగిసిన జీవితం

Actor Chalam: తెరపై ఎప్పుడు చూసినా యాక్టివ్ గా కనిపించే పాత్రలనే చలం పోషించారు.

Update: 2021-06-09 07:34 GMT

నటుడు చలం (ఫైల్ ఇమేజ్)

Actor Chalam: వెండితెరపై కథానాయకుడిగా చలం స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. ఒక వైపున ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా చెలరేపోగితుంటే.. మరో వైపున కొత్తగా వచ్చిన కృష్ణ, శోభన్ బాబు లాంటి వాళ్ళు వరుస హిట్స్ తో హవా సాగుతుండగా.. మరో నటుడికి తమ ఉనికిని చాటుకోవటం కష్టమే.ఇక అలాంటి పరిస్థితుల్లో చలం తెలివిగా ఒక ప్రత్యేకమైన జోనర్ ను ఎంపిక చేసుకుని సేఫ్ గా ఆ లైన్ లో సినిమాలు చేస్తూ వెళ్లారు చలం.

తెరపై ఎప్పుడు చూసినా యాక్టివ్ గా కనిపించే పాత్రలనే చలం పోషించారు. సహజమైన నటనతో తన పాత్రలను ప్రేక్షకులకు చాలా దగ్గరగా తీసుకెళ్లేవారు.ఇక చలం వరుస సినిమాలతో ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు. చలానికి కథాకథనాలపై మంచి పట్టు ఉండటంతో సినిమాల ఎంపికపై దృష్టి పెట్టారు. ఇకపల్లెటూరి నేపథ్యంలో ఎక్కువ సినిమాలు చేశారు చలం. ప్రేక్షకులు వెంటనే వాటికి కనెక్ట్ అయ్యేవారు. గ్రామీణ వాతావరణం, అక్కడి పెద్దల అరాచకాలు వాళ్లపై తన తిరుగుబాటు .. ఇలా ఆయన కథలు సాగేవి. అందువలన మాస్ ఆడియన్స్ నుంచి ఆయనకి కావలసిన మద్దతు లభించింది. ఒకానొక దశలో చలం సినిమా అంటే అది కచ్చితంగా హిట్టే అనే టాక్ వచ్చేసింది. అంతలా చలం సినిమాలు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాయి.

కథాకథనాలపై చలానికి మంచి పట్టు ఉంది అలాగే పాటలపై కూడా ఆయనకి మంచి అవగాహన ఉండేది. సినిమాకి పాటలు ప్రాణం అని భావించిన ఆయన ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు. అందువలన చలం సినిమాల్లోని పాటల్లో దాదాపు హిట్లే కనిపిస్తాయి. అలా చలం నటుడిగా నిర్మాతగా ఒక వెలుగు వెలిగారు. సొంత బ్యానర్లో చేసిన కొన్ని సినిమాలు దెబ్బతినడం వలన ఆర్ధికంగా వైవాహిక జీవితంలోని ఒడిదుడుకుల వలన మానసికంగా .. మద్యం అలవాటు కారణంగా ఆరోగ్యపరంగా ఆయన ఇబ్బందులు పడ్డారు. అలా అభిమానుల మనసుకు కష్టం కలిగించే విధంగానే ఆయన జీవితం ముగిసింది.

Tags:    

Similar News