చిరంజీవి నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు

Update: 2020-02-29 04:46 GMT
Chiranjeevi File Photo

ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మెగాస్టార్ చిరంజీవి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రకటనకు చిరంజీవి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అమరావతి జేఏసీ నాయకులు చిరంజీవి ఇంటి ముందు ధర్నాకు పిలునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ అభిమానులు పెద్ద ఎత్తున చిరంజీవి ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసులు చిరంజీవీ ఇంటి ముందు హైసెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పరిసరాల్లోకి ఎవరిని రానియాకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. జేఏసీ మాత్రం చిరంజీవి నివాసం వద్ద ధర్నాతో తమకు సంబంధం లేదని వెల్లడించింది.

మెగా అభిమానులు చిరంజీవి ఇంటి వద్దకు చెరుకోని మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. మెగాస్టార్‌కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని అభిమానులు హెచ్చరించారు. చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. జగన్ మూడు రాజధానులను చిరంజీవి స్వాగతించారు. మూడు రాజధానులను అందరూ స్వాగతించాలని లేఖ కూడా రాశారు. పాలన వికేంద్రికరణతో అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

జీఎన్ రావు కమిటీ సిఫార్సులు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేలా ఉన్నాయని అభిప్రాయం తెలిపారు. అయితే ఏపీలో మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు తెలపడం అప్పట్లోనే హాట్ టాపిక్ గా మారింది. అమరావతి రైతులు సినిమా హీరోల ఇళ్ల ఎదుట కూడా గతంలో ఆందోళనలు నిర్వహించారు. మహేష్ బాబు ఇంటి దగ్గర కూడా నిరసన దీక్షలు చేపట్టారు. అప్పట్లో మహేష్‌ ఈ విషయంపై స్పందించలేదు.

  

Full View


Tags:    

Similar News