Samantha and Rashmika : అక్కా చెల్లెళ్లుగా సమంత, రష్మిక?

Samantha and Rashmika : ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించడం అనేది కొత్తేమి కాదు.. అయితే ఆ సినిమాల్లో ఒకరు స్టార్ హీరోయిన్ ఉంటారు...

Update: 2020-08-09 10:37 GMT
samantha, rashmika

Samantha and Rashmika : ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించడం అనేది కొత్తేమి కాదు.. అయితే ఆ సినిమాల్లో ఒకరు స్టార్ హీరోయిన్ ఉంటారు... మరొకరు ఓ మోస్తరు పేరున్న హీరోయిన్‌ అయి ఉంటారు. కానీ ఇద్దరు స్టార్ హీరోయిన్లు కలిసి ఓకే సినిమాలో ఉండడం అనేది చాలా అరుదు అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించే ఓ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కలిసి అక్కా చెల్లెళ్ళుగా నటించనున్నారని ఫిలిం నగర్ లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో కాదు.. సమంత అక్కినేని, రష్మిక మందన్నా.. లాక్‌డౌన్‌ సమయంలో ఓ యంగ్ డైరెక్టర్ వీరిద్దరి కోసం మహిళా ప్రాధాన్యమున్న ఓ కథను సిద్ధం చేశాడని, ఆ కథను వీరిద్దరికీ వినిపించగా ఒకే కూడా చెప్పారని తెలుస్తోంది. ఈ సినిమాని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నట్టుగా సమాచారం.. దీనిపైన త్వరలో ఓ అధికార ప్రకటన వెలువడనుంది..

ఇక పెళ్లి తర్వాత మంచి కథలను ఎంచుకుంటూ సక్సెస్ ని సొంతం చేసుకుంటుంది సమంత.. ఈ ఏడాది జాను సినిమాతో ఆకట్టుకున్న సమంత ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటూ టెర్రస్‌ గార్డెనింగ్‌ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇక అటు రష్మిక ఈ ఏడాది మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టింది.. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో 'పుష్ప' చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళ, కన్నడ భాషల్లోనూ పలు సినిమాలు చేస్తోంది. 

Tags:    

Similar News