Keerthi Reddy: సుమంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కీర్తి రెడ్డి

Keerthi Reddy: మాజీ భర్త పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్న ఒకప్పటి హీరోయిన్

Update: 2021-10-12 13:08 GMT
Heroin Keerthi Reddy Sensational Reddy Comments on Sumanth

సుమంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కీర్తి రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

  • whatsapp icon

Keerthi Reddy: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తొలిప్రేమ" సినిమా తో ప్రేక్షకులను అలరించిన కీర్తి రెడ్డి ఆ తరువాత కూడా కొన్ని మంచి సినిమాలలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా మసులుకుంటున్న కీర్తి రెడ్డి కరియర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నటుడు సుమంత్ ని 2004లో ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ వీరిద్దరి పెళ్లి ఎక్కువకాలం నిలవలేదు. 2006లో వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత ఇండస్ట్రీ నుండి ఈమె దూరంగా వెళ్ళిపోయింది. విడాకుల తర్వాత ఆమె ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకొని లండన్లో సెటిల్ అయింది.

ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కరియర్ విషయం పక్కనపెడితే వైవాహిక జీవితంలో మాత్రం చాలా సంతోషంగా ఉన్న కీర్తిరెడ్డి తాజాగా ఇప్పుడు చేసిన సంచలన వ్యాఖ్యలు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. సుమంత్ ను పెళ్లి చేసుకొని ఉండకపోతే తన జీవితం ఇంకెంతో బాగుండేదని ఆమె అనడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఇక మరోవైపు సుమంత్ మేనల్లుడు నాగచైతన్య మరియు సమంత కూడా విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత కూడా మరో కీర్తిరెడ్డి కాబోతోందని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News