Vijay Devarakonda Arjun Reddy : కట్ చేసిన సీన్లతో మళ్ళీ ధియేటర్ లోకి అర్జున్ రెడ్డి!
Vijay Devarakonda Arjun Reddy : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..
Vijay Devarakonda
Vijay Devarakonda Arjun Reddy : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2017లో రిలీజ్ అయి పెద్ద ప్రభంజనం సృష్టించింది.. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు.. చేసిన మొదటి సినిమానే సందీప్ కి బాలీవుడ్ లో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అక్కడ ఇదే సినిమాని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో కబీర్ సింగ్‌గా తెరకెక్కించి భారీ హిట్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగ.. తాజాగా ఈ చిత్రం విడుదలై మూడేళ్ళ అయిన సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ముందుగా ఈ సినిమాని 4.20 నిమిషాల నిడివితో ఉండేలా తెరకెక్కించామని సందీప్ వెల్లడించాడు.. అయితే ఇలా అయితే ధియేటర్ లో నాలుగు షోలు నడిపించడం కష్టమని థియేటర్ ఓనర్లు చెప్పడంతో సినిమాని 3 గంటల 45 నిమిషాలకు కుదించామని సందీప్ వెల్లడించాడు.. దీనివలన కొన్ని కొన్ని సీన్లను తొలగించాల్సి వచ్చిందన్నారు. కొన్ని కారణాల వల్ల చివరికి 3.06గంటల నిడివి ఉన్న సినిమాని మాత్రమే విడుదల చేశామని చెప్పారు. ఒకవేళ 3.45గంటల నిడివితో విడుదల చేస్తే మరింత హిట్ అయ్యేదని చెప్పుకొచ్చాడు.
అయితే కట్ చేసిన సన్నివేశాలతో కలిపి ఐదేళ్లు పూర్తయ్యే సందర్భంగా 2022 ఆగస్టు 25న 3 గంటల 45 నిమిషాల 'అర్జున్ రెడ్డి' సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు సందీప్.. ఇందులో చాలా ఫన్నీ సీన్లు ఉంటాయని, శివ, కమల్, విద్య, కీర్తి ఎలా క్లోజ్ అయ్యారు, అర్జున్ రెడ్డి స్కూల్ ప్రెండ్స్.. అతని బాల్యం, బుల్లెట్ బైక్ సంబంధించిన సీన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సందీప్ చెప్పుకొచ్చాడు.