Shivabalaji Complaint In HRC : హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన శివబాలాజీ!
Shivabalaji Complaint In HRC : మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ తీరుపై సినీ హీరో శివబాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ మేరకు ఆయన
shiva balaji
Shivabalaji Complaint In HRC : మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ తీరుపై సినీ హీరో శివబాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ మేరకు ఆయన స్కూల్ పైన మానవ హక్కుల కమిషన్ ( హెచ్ఆర్సీ)లో లో ఫిర్యాదు చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన శివబాలాజీ బలవంతంగా ఈ స్కూల్ ఫీజులను వసూలు చేస్తుందని, ప్రభుత్వ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని పేర్కొన్నాడు.. తన పిల్లలకు ఆన్లైన్ క్లాసులు చెప్పకుండా యాజమాన్యం ఐడీలను బ్లాక్ చేసిందని, ఏంటి ఇది అని ప్రశ్నిస్తే కేసులు పెడతాం అంటూ బెదిరిస్తుందని శివ బాలాజీ వెల్లడించారు.. మీరు పిల్లలకు క్లాసులు తీసుకోవడం కాదు, నేను మీకు క్లాసులు తీసుకుంటా' అంటూ శివబాలాజీ ఫైర్ అయ్యారు..
ఇక శివబాలాజీ హీరోగా అందరికి సూపరిచితుడే.. మొదట్లో తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ వచ్చిన శివబాలాజీ ఆ తరవాత ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత దోస్త్, ఆర్య, సంక్రాంతి, చందమామ, కాటమరాయుడు మొదలగు సినిమాల్లో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక తెలుగులో బాస్ వన్ సీజన్ లో పాల్గొని విజేత గా నిలిచాడు.. ఇక 2009లో శివ బాలాజీ తన సహనటి అయిన మధుమితని పెళ్లి చేసుకున్నారు.. వారికి ధన్విన్, గగన్ అనే ఇద్దరు కుమారులున్నారు