బిగ్ బాస్ 3 పై శివబాలాజీ షాకింగ్ కామెంట్స్ ..

బిగ్ బాస్ 3 పై శివబాలాజీ షాకింగ్ కామెంట్స్ ..
x
Highlights

నార్త్ నుండి వచ్చి దక్షినాన పాగా వేసిన రియాలిటీ షో బిగ్ బాస్.. ఇప్పుడు ఈ షో కి ఎక్కడలేని క్రేజ్, టీఆర్ పి రేటింగ్స్.. ఇప్పటికే ఈ షో రెండు సీజన్స్ ని...

నార్త్ నుండి వచ్చి దక్షినాన పాగా వేసిన రియాలిటీ షో బిగ్ బాస్.. ఇప్పుడు ఈ షో కి ఎక్కడలేని క్రేజ్, టీఆర్ పి రేటింగ్స్.. ఇప్పటికే ఈ షో రెండు సీజన్స్ ని కంప్లీట్ చేసుకొని మూడవ సీజన్ లోకి అడుగుపెట్టింది. హీరో కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పుడు చివరికి చేరింది. 17 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోలో ప్రస్తుతం హౌస్‌లో 7 మంది మాత్రమే మిగిలారు. ఇందులో ఏడుగురూ నామినేషన్ కి వెళ్ళడంతో ఇప్పుడు ఎవరు నామినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.

అయితే థర్డ్ సీజన్ పై హీరో , బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఓ ప్రముఖ యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా శివబాలాజీ మాట్లాడుతూ నేను ఎక్కువగా ఎంటర్‌టైన్మెంట్ ని ఇష్టపడుతాను కానీ ఈ సీజన్ లో నాకు అది ఎక్కడ కూడా కనిపించడం లేదు. కొన్ని ఎపిసోడ్స్ చూసాను.. కనెక్ట్ కాలేకపోయాను. ఆ తర్వాత బిజీగా ఉండడం వల్ల చూడడం మానేశాను అని చెప్పుకొచ్చాడు శివబాలాజీ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories